నవమాసాలు మోసి, కని పెంచిన తల్లే కర్కశంగా మారింది. రెండు సంవత్సరాలు కూడా పూర్తి గా నిండని ఓ పసి బిడ్డను కన్నే తల్లే గొంతు కోసి దారుణంగా హత్య చేసింది ఈ దారుణ సంఘటన జీడిమెట్లలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి  వెళితే జీడిమెట్ల షాపూర్ నగర్ కి చెందిన మహిళ మంగళవారం ఉదయం నెలన్నర వయసుగల తన కన్నకూతురి గొంతు కోసి హత్య చేసింది. అనంతరం తన గొంతు కూడా కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కాగా.. చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా.. తల్లి పరిస్థితి విషమంగా ఉంది. 

కుటుంబకలహాల కారణంగానే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.