కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు తట్టుకోలేక ఓ వివాహిత పిల్లలతో కలిసి బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.

Also Read ప్రియుడితో రాసలీలలు.. అడ్డుగా ఉన్నాడని భర్తని.....

పూర్తి వివరాల్లోకి వెళితే...కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కరీంపేటకు చెందిన గడ్డం రాజుకు ఇప్పలపల్లికి చెందిన రమ్య(25)తో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు శివమణి(5), అమ్ములు(2) ఉన్నారు. 

కూలి పని చేసుకుంటున్న రాజు, రమ్యలకు ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో తరచూ గొడవ పడుతుండేవారు. ఆదివారం భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో రమ్య పిల్లలను తీసుకుని రాత్రి వేళ మోపెడ్‌పై కరీంపేట సమీపంలోని ఎస్సారెస్పీ ప్రధాన కాలువకు వెళ్లి చిన్నారులతో సహా దూకింది.  రమ్య, అమ్ములు మృతదేహాలు లభ్యం కాగా, శివమణి మృతదేహం లభించలేదు. కాగా.. ఆవేశంలో రమ్య తీసుకున్న నిర్ణయంపట్ల కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.