Asianet News TeluguAsianet News Telugu

హైద్రాబాద్‌ బోరబండలో విషాదం: ఇద్దరు పిల్లను చంపి తల్లి సూసైడ్

హైద్రాబాద్ నగరంలోని బోరబండలో  విషాదం చోటు చేసుకుంది.  ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య చేసుకుంది. 

Mother Commits Suicide after killed  her Two children in Hyderabad lns
Author
First Published Oct 13, 2023, 11:36 AM IST

హైదరాబాద్: నగరంలోని బోరబండలో  శుక్రవారంనాడు విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకుంది తల్లి.  ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. బోరబండలో నివాసం ఉంటున్న జ్యోతి అనే  వివాహిత  తన ఇద్దరు కొడుకులను చంపింది. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుంది.  నాలుగేళ్ల వయస్సున్న అర్జున్, రెండేళ్ల వయస్సున్న  ఆదిత్యను  జ్యోతి హత్య చసింది. ఆ తర్వాత  ఆమె ఆత్మహత్య చేసుకుంది.

ప్రభుత్వ స్కూల్ లో   జ్యోతి టీచర్ గా పనిచేస్తుంది. జ్యోతి, విజయ్ ను వివాహం చేసుకుంది.  విజయ్ కాంట్రాక్టర్ గా పనిచేస్తున్నాడు. జ్యోతి, విజయ్ ది మేనరికపు వివాహం.  జ్యోతికి పుట్టిన ఇద్దరు పిల్లలకు ఆరోగ్య సమస్యలున్నాయని  బంధువులు చెప్పారు. దీంతో  జ్యోతి డిప్రెషన్ కు గురైనట్టుగా చెబుతున్నారు. దీనికి తోడు పని ఒత్తిడితో  ఆమె ఇబ్బంది పడుతున్నారని  బంధువులు చెబుతున్నారు.  ఈ కారణంగానే  పిల్లలను ఇద్దరిని చంపి తాను కూడ ఆత్మహత్య చేసుకొని ఉంటుందని  బంధువులు చెప్పారు.ఇదిలా ఉంటే భార్యా, పిల్లల ఆత్మహత్యతో  విజయ్ కూడ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు.

నగరంలో ఇదే తరహా ఘటన మరోటి చోటు చేసుకుంది. ఒకే రోజున రెండు ఘటనలు నగరంలో విషాదాన్ని నింపాయి.గురువారంనాడు రాత్రి భోజనం చేసి పడుకున్న తర్వాత  భర్త, ఇద్దరు పిల్లలు మృతి చెందడం కలకలం చోటు చేసుకుంది.

సికింద్రాబాద్ బోయిన్ పల్లిలో కూడ  శుక్రవారంనాడు తెల్లవారుజామున విషాదం చోటు చేసుకుంది.  శ్రీకాంతాచారి అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి చంపాడు. ఆ తర్వాత తాను కూడ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  తన భార్యకు  విషం ఇచ్చాడు. ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.

ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదు

సమస్యలు వచ్చిన సమయంలో  ఆత్మహత్యలు చేసుకోవడం  సరైంది కాదని మానసిక నిపుణులు చెబుతున్నారు.  సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలని సూచిస్తున్నారు. జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 )  కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.

Follow Us:
Download App:
  • android
  • ios