ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతితో కోరిక తీర్చుకుని వదిలేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌ కాప్రాకు చెందిన యువతి స్థానిక జూనియర్ కాలేజీలో రిసెప్షనిస్ట్‌గా పని చేస్తోంది.

ఈ క్రమంలో ఆమెకు నాచారం హెఎంటీ నగర్‌కు చెందిన అబ్దుల్ మజీద్‌తో పరిచయం ఏర్పడింది. అయితే ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పిన మజీద్ తన ఇంటికి తీసుకెళ్లి పలుమార్లు శారీరకంగా అనుభవించాడు.

దీంతో పెళ్లి చేసుకోవాలని బాధితురాలు నిలదీయడంతో మజీద్ అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు. తాను పెళ్లి చేసుకోనని, తన వద్ద ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు.

ఇందుకు అబ్దుల్ మజీద్ తల్లి సలేహా సహీన్ కూడా సహకరించినట్లు తెలిపింది. అంతేకాకుండా తన వద్ద రూ.60 వేలు నగదు, 7.5 గ్రాములు తీసుకున్నాడు. వీరి వేధింపులు ఎక్కువ కావడంతో అబ్దుల్ మజీద్ అతని తల్లి సలేహాపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తల్లీకొడుకులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.