విషాదం: భర్త, కొడుకు మృతి తట్టుకోలేక తల్లి , కూతురు సూసైడ్

https://static.asianetnews.com/images/authors/4dc3319f-b603-5b5b-b2b3-3421e0f11ce6.jpg
First Published 24, Aug 2018, 4:56 PM IST
mother and daughter committed suicide in Hanmakonda
Highlights

భర్త, కొడుకు మరణించడంతో  మనోవేదనకు గురైన  సరిత అనే మహిళ తన కూతురితో పాటు తాను ఉరేసుకొని చనిపోయింది.ఈ ఘటన హన్మకొండలోచోటు చేసుకొంది. 


హాన్మకొండ: భర్త, కొడుకు మరణించడంతో  మనోవేదనకు గురైన  సరిత అనే మహిళ తన కూతురితో పాటు తాను ఉరేసుకొని చనిపోయింది.ఈ ఘటన హన్మకొండలోచోటు చేసుకొంది. 

హన్మకొండ తహాసీల్దార్ కార్యాలయంలో  మనుగొండ సరిత రెవిన్యూ ఇన్స్‌పెక్టర్ గా పనిచేస్తోంది. సరిత భర్త బాబు కానిస్టేబుల్‌. 1992 బ్యాచ్‌లో కానిస్టేబుల్‌ ఉద్యోగానికి ఎంపికైన బాబు  2007లో అనారోగ్యంతో మరణించాడు.  భర్త మరణించడంతో సరితకు రెవిన్యూ శాఖలో ఉద్యోగం లభించింది.

హన్మకొండ తహాసీల్దార్ కార్యాలయంలో ఆమె రెవిన్యూ ఇన్స్ పెక్టర్ గా పనిచేస్తోంది.  భర్త చనిపోయినా... కొడుకు రోహిత్, కూతురు  మధుమితలను చదవిస్తూ సరిత జీవనం సాగిస్తోంది.  అయితే నాలుగు నెలల క్రితం సరిత కొడుకు రోహిత్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు.

దీంతో  సరిత తీవ్ర మనోవేదనకు గురైంది. భర్త చనిపోయి.. కొడుకు దూరమై  ఆమె షాక్‌ కు గురైంది.రోహిత్ మరణించిన తర్వాత సరిత కొంత కాలం పాటు ఉద్యోగానికి వెళ్లడం మానేసింది. బంధువులు,స్నేహితులు ఆమెకు నచ్చజెప్పారు. దీంతో ఆమె తిరిగి విధులకు హాజరౌతోంది.

సరిత  తన పుట్టింట్లోనే కూతురితో కలిసి ఉంటుంది. గురువారం నాడు బంధువుల ఇంట్లో పెళ్లికి తల్లిదండ్రులు వెళ్లారు.ఈ పెళ్లికి సరిత కూడ వెళ్లాల్సి ఉంది. కానీ, ఆమె వెళ్లలేదు.  గురువారం నాడు  తల్లిదండ్రులు, అన్నా వదినలు  ఇంటికి వచ్చే సరికి సరిత, ఆమె కూతురు మధుమితలు ఉరేసుకొని చనిపోయారు. సరిత తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

loader