మంచిర్యాల జిల్లాలో  విద్యుత్ షాక్ తో ఒకే కుటుంబంలో ఇద్దరు మరణించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.  పొలంలో ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో బుధవారం నాడు విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలో ముగ్గురికి విద్యుత్ షాక్ తగిలింది.ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

మంచిర్యాల మండలం కోటపల్లి మండలం బొప్పారంలో పొలంలో ఒకే కుటుంబంలో ముగ్గురికి విద్యుత్ షాక్ తగిలింది. పొలంలో ఉన్న ఏడాది చిన్నారి తో పాటు చిన్నారి తల్లి విద్యుత్ షాక్ కు గురైంది. ఈ విషయాన్ని గమనించిన చిన్నారి తండ్రి వారిని కాపాడే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆయన కూడ విద్యుత్ షాక్ కు గురయ్యారు. పొలంలోనే ఈ ముగ్గురు విద్యుత్ సాక్ కు గురైన విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి, ఆమె తల్లి మృతి చెందింది. చిన్నారి తండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ టీవీ 9 కథనం ప్రసారం చేసింది.