భూపాలపల్లి జిల్లా అధికారులు ఈ వరదలో చిక్కుకుని మృతి చెందిన ముగ్గురు గ్రామస్తుల మృతదేహాలను వెలికితీశారు. ఇది జరిగి వారం రోజులు గడుస్తున్నా గడ్డం మహాలక్ష్మి జాడ లేదు. ఆమె కోసం భర్త ఆశగా ఎదురుచూస్తున్నాడు.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కురిసినవర్షాలకు వివిధ ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా మోరంచపల్లి వాగు వరదకు మొరంచపల్లి గ్రామం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. వరద ఉదృతి తగ్గిన తరువాత అక్కడి శిథిలాలను చూసి గ్రామస్తులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు.
ఓ గ్రామస్తుడు తప్పిపోయిన తన భార్య కోసం ఎదురు చూస్తున్నాడు. మోరంచ వాగు వరద 15 అడుగుల ఎత్తులో ప్రవహించడంతో గ్రామంలోని ఇళ్లు, పశువులు, వాహనాలు ప్రతిదీ కొట్టుకుపోయాయి. భూపాలపల్లి జిల్లా అధికారులు ఈ వరదలో చిక్కుకుని మృతి చెందిన ముగ్గురు గ్రామస్తుల మృతదేహాలను వెలికితీశారు. ఇది జరిగి వారం రోజులు గడుస్తున్నా గడ్డం మహాలక్ష్మి జాడ లేదు.
Hyderabad : వదినకు ఫుల్లుగా మందుకొట్టించి... మత్తులోకి జారుకోగానే మరిది దారుణం
బుధవారం వరదలో దెబ్బతిన్న గ్రామంలో నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందం పర్యటించింది. ఈ సమయంలో గడ్డం మహాలక్ష్మి భర్త గడ్డం శ్రీనివాస్ వారితో మాట్లాడాడు. “దయచేసి నా భార్యను కనిపెట్టండి. ఆమె చనిపోతే, ఆమె మృతదేహాన్నైనా ఇప్పించండి..’ అంటూ మొరపెట్టుకున్నాడు. అతని అమాయకపు విజ్ఞప్తి చాలా మంది గ్రామస్తులను కంటతడి పెట్టించింది.
జూలై 26-27 మధ్య రాత్రి వరదల్లో నలుగురు గ్రామస్తులు కొట్టుకుపోగా, రెస్క్యూ బృందాలు, పోలీసులు మూడు మృతదేహాలను కనుగొన్నారు. ఒడిరెడ్డి, వజ్రమ్మ, సరోజ మృతదేహాలను వెలికి తీశారు. ఆ రాత్రి, శ్రీనివాస్, అతని భార్య వరద నీరు వేగంగా పెరుగుతుండడంతో ఓ చెట్టును పట్టుకుని తమని తాము రక్షించుకున్నారు. ఆ తరువాత వారికి
సిమెంట్ స్తంభం కనిపించింది. దాన్ని పట్టుకుంటే తాము మరింత సురక్షితంగా ఉంటామని భావించారు. ఆ ప్రయత్నంలో ఉండగా.. వరద ఉదృతి పెరుగింది.
అధికారులు తమను రక్షిస్తారని దంపతులు ఆశగా ఎదురు చూశారు. కానీ వారి ఆశ నిరాశ అయ్యింది. మహాలక్ష్మి పెరిగినవరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. "వరదలో కొట్టుకుపోతున్న గేదె ఆమెను నీటిలోకి నెట్టింది" అని శ్రీనివాస్ గుర్తు చేసుకున్నారు. వారిద్దరూ తెల్లవారుజామున 3.30 గంటలకు లేచారు. 4 గంటల సమయంలో గ్రామంలో నీటి ప్రవాహం పెరుగుతోందని తమ బంధువు నుంచి ఫోన్ వచ్చిందని శ్రీనివాస్ తెలిపారు.
భార్యాభర్తలు ఇంటి నుంచి బయటకు వచ్చి చూడగా మోకాళ్లలోతు నీరు ఉండటాన్ని గమనించారు. నీటి ఉధృతి పెరగడంతో ఇంటి సమీపంలోని చెట్టు మీదికి ఎక్కితే తమ ప్రాణాలను కాపాడుకోవచ్చనుకున్నారు.
“అది చూసిన మేము చెట్టును పట్టుకున్నాం. మిగతా ఇళ్లలోని గృహోపకరణాలు, పాత్రలు నీళ్లలో కొట్టుకు వస్తూ మమ్మల్ని కొట్టుకుంటూ వెళ్లాయి. దాదాపు ఒక గంట అలా ఉన్న తరువాత.. మాకు ఒక సిమెంట్ స్తంభం కనిపించింది. చెట్టునుంచి ఆ పోల్ కు కాస్త ప్రయత్నం మీద మారాం ”అని అతను చెప్పాడు.
పెరుగుతున్న వరద ఉదృతికి కొట్టుకుపోకుండా ఉండడానికి మహాలక్ష్మి తన భర్తను గట్టిగా పట్టుకుని.. పట్టు ఉండేలా ప్రయత్నించింది. కానీ నీటి ఉదృతికి ఆమె కొట్టుకుపోయింది. శ్రీనివాస్ తన భార్య ఎక్కడ ఉందో చూసేందుకు మరింత స్తంభం పైకి ఎక్కాడు. కానీ ఆమె కనిపించకుండా పోయింది. "నేను స్తంభం మీది నుండి పదే పదే నీటిలోకి జారిపోతూనే ఉన్నాను, జారిన ప్రతీసారి పైకి ఎక్కుతూ నన్ను నేను రక్షించుకున్నాను" అని పీడకల లాంటి అనుభవాన్ని గుర్తుచేసుకున్నాడు.
