అవినీతిలో గాంధీ ఆస్పత్రితో పోటీపడుతున్న ఉస్మానియా
తెలంగాణలో సర్కారు దవాఖానాల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. నేను రాను కొడుకో సర్కారు దావాఖానుకు అంటూ మన ఆస్పత్రుల దుస్థితిని ఏనాడు కళ్లకు కట్టినట్లు పాట రూపంలో చెప్పారు.
నవ తెలంగాణ రాష్ట్రంలోనూ ఇక్కడి ఆస్పత్రిలో సిబ్బంది అరాచకం, అవినీతి కంపు, నిర్లక్ష్యపు జబ్బు అలానే కొనసాగుతూనే ఉన్నాయి.
ఇటీవల గాంధీ ఆస్పత్రిలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి ఎక్స్పెయిరీ డేట్ మందులు వాడి చిన్నారుల ప్రాణాల మీదకు తీసుకొచ్చన విషయం తెలిసిందే. ఇంతేనా గాంధీ ఆస్పత్రిలో సిబ్బంది నిర్వాకం గురించి రాస్తే అది రామకోటి అంత పెద్దది అవుతుంది.
ఇప్పుడు ఈ లిస్టులో హైదరాబాద్ లోని ఉస్మానియా ఆస్పత్రి కూడా చేరుతానంటోంది. ఇక్కడ కూడా సిబ్బంది గాంధీ ఆస్పత్రి సిబ్బందితో అవినీతి, నిర్లక్ష్యంలో పోటీపడుతున్నారు.
ఉస్మానియా ఆస్పత్రిలో లోపలికి వెళ్లడానికి కూడా లంచం ఇవ్వాల్సిందే. రోగులను కలవాలనుకున్నా సెక్యూరిటీ గార్డులకు అమ్యామ్యాలు ఇవ్వాల్సిందే.
