Asianet News TeluguAsianet News Telugu

పోలీసుల అదుపులో మోజో టీవీ మాజీ సీఈఓ రేవతి

మోజో  టీవీ మాజీ సీఈఓ రేవతిని శుక్రవారం నాడు బంజరాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు..  మోజీ టీవీ స్టూడియోలో  తనను అవమానించారని దళిత నేత హమారా ప్రసాద్ పెట్టిన కేసులో రేవతి ఏ2 గా ఉన్నారు. 

mojo tv former ceo revathi arrested in hyderabad
Author
Hyderabad, First Published Jul 12, 2019, 11:45 AM IST

హైదరాబాద్: మోజో  టీవీ మాజీ సీఈఓ రేవతిని శుక్రవారం నాడు బంజరాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.  మోజీ టీవీ స్టూడియోలో  తనను అవమానించారని దళిత నేత హమారా ప్రసాద్ పెట్టిన కేసులో రేవతి ఏ2 గా ఉన్నారు. 

ఈ  కేసు విషయమై తాము ఇచ్చిన నోటీసులకు రేవతి స్పందించలేదని  పోలీసులు చెబుతున్నారు. దీంతో శుక్రవారం ఉదయం ఆమెను బంజారాహిల్స్ పోలీసులు మోజో  టీవీ మాజీ సీఈఓ రేవతిని శుక్రవారం నాడు బంజరాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. రేవతి ఇంటికి పోలీసులు వచ్చారు. ఎలాంటి వారంట్, నోటీసులు లేకుండానే తనను పోలీస్ స్టేషన్ కు రావాలని పోలీసులు చెబుతున్నారని ఆమె ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

 

మోటీ టీవీ  మాజీ సీఈఓ రేవతిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు. మీడియాపై, జర్నలిస్టులపై వేధింపులకు ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తోందని  రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. ఈ విషయంలో  ప్రభుత్వం  జోక్యం చేసుకోవాలని  ఆయన కోరారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios