Asianet News TeluguAsianet News Telugu

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు: హైకోర్టులో ముగ్గురు నిందితుల బెయిల్ పిటిషన్

ఎమ్మెల్యేల   ప్రలోభాల  కేసులో   ముగ్గురు  నిందితులు  తెలంగాణ హైకోర్టులో  బెయిల్  పిటిషన్లు దాఖలు  చేశారు. 

moinabad farm house Case three Accused Filed Bail petition in telangana High court
Author
First Published Nov 25, 2022, 2:53 PM IST

హైదరాబాద్:  టీఆర్ఎస్  ఎమ్మెల్యేల  ప్రలోభాల  కేసులో  ముగ్గురు నిందితులు  హైకోర్టులో  శుక్రవారంనాడు   బెయిల్  పిటిషన్లు దాఖలు  చేశారు.   గతంలో  ఈ  ముగ్గురు నిందితులు  ఏసీబీ కోర్టులో దాఖలు  చేసిన బెయిల్  పిటిషన్లను  ఏసీబీ కోర్టు  కొట్టివేసింది.  దీంతో  నిందితులు హైకోర్టులో  పిటిషన్  దాఖలు  చేశారు.ఇదే  విషయమై  నిందితులు  గతంలో సుప్రీంకోర్టులో  కూడా  బెయిల్  పిటిషన్  దాఖలు  చేశారు. అయితే ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.  తెలంగాణ హైకోర్టులోనే  బెయిల్ పిటిషన్  దాఖలు  చేయాలని షుప్రీంకోర్టు  సూచించింది.  దీంతో  నిందితులు  ముగ్గురు  ఇవాళ  తెలంగాణ  హైకోర్టులో  బెయిల్  పిటిషన్లు  దాఖలు  చేశారు.ఈ  పిటిషన్  పై  తెలంగాణ హైకోర్టు రేపు  విచారణ నిర్వహించే అవకాశం  ఉంది.

గత  నెల  26వ తేదీన  రామచంద్రభారతి,  సింహయాజీ,  నందకుమార్  లను  మొయినాబాద్  పోలీసులు  అరెస్ట్  చేశారు. టీఆర్ఎస్  కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభాలకు  గురిచేశారని  నమోదైన  కేసులో  ఈ  ముగ్గురిని  పోలీసులు అరెస్ట్  చేశారు.  అచ్చంపేట ఎమ్మెల్యే  గువ్వల బాలరాజు,  కొల్లాపూర్  ఎమ్మెల్యే  బీరం హర్షవర్ధన్ రెడ్డి,  పినపాక  ఎమ్మెల్యే  రేగా  కాంతారావు, తాండూరు  ఎమ్మెల్యే  పైలెట్ రోహిత్  రెడ్డిలను   ఈ  ముగ్గురు  ప్రలోభాలకు  గురి చేశారని  ఆరోపణలున్నాయి,.  ఈ  మేరకు   రోహిత్  రెడ్డి   పోలీసులకు  ఫిర్యాదు  చేశారు.ఈ  ఫిర్యాదు  ఆధారంగా  ఈ ముగ్గురిని  పోలీసులు  అరెస్ట్ చేశారు. ఇప్పటికే  ఈ కేసులో  ఈ  ఇద్దరిని పోలీసులు  రెండు  రోజుల పాటు  కస్టడీలోకి  తీసుకొని విచారించారు. మరో  వైపు  మరో  10 రోజుల పాటు  ఈ  ముగ్గురిని  కస్టడీ కోరుతూ  సిట్  దాఖలు  చేసిన పిటిషన్ ను ఏసీబీ  కోర్టు  కొట్టివేసింది.  

allso read:తెలంగాణ హైకోర్టుకి బీఎల్ సంతోష్: క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన బీజేపీ నేత

మరింత  సమాచారం  రాబట్టేందుకు నిందితులను  పది రోజుల కస్టడీ  కోరుతూ  సిట్  పిటిషన్  దాఖలు  చేసింది.  అయితే  రెండు  రోజుల పాటుమ విచారణ  నిర్వహించినందున మరోసారి  కస్టడీ అవసరం లేదని  ఏసీబీ కోర్టు  అభిప్రాయపడింది.  దీంతో  సిట్  పిటిషన్ ను  కొట్టివేసింది. ఈ  కేసు నేపథ్యంలో  బీజేపీ, టీఆర్ఎస్  మధ్య  మాటల  యుద్ధం  సాగింది.  ఎమ్మెల్యేల  ప్రలోభాల  వెనుక బీజేపీ  ఉందని  టీఆర్ఎస్  ఆరోపించింది.  కానీ  ఈ ఆరోపణలను  బీజేపీ  తోసిపుచ్చింది.  ఈ  కేసును ప్రత్యేక సిట్  తో కానీ, సీబీఐ విచారణకు  ఆదేశించాలని  కోరుతూ  బీజేపీ  తెలంగాణ హైకోర్టులో పిటిషన్  దాఖలు చేసింది.ఈ  పిటిషన్ పై  ఈ నెల  30న హైకోర్టు  విచారణ  నిర్వహించి  తీర్పును వెల్లడించే  అవకాశం  ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios