మొయిన్ ఖురేషీ కేసులో హైదరాబాద్‌కు చెందిన పారిశ్రామిక వేత్త సానా సతీశ్‌ను ఈడీ, సీబీఐ పలు కేసుల్లో విచారిస్తూ వస్తున్నాయి. ఈ విచారణలో భాగంగా అతను కొందరు ఉన్నతాధికారులకు ముడుపులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

ఖురేషి అక్రమాస్తుల కేసులో సతీశ్ సాక్షిగా ఉన్నాడు. ఆయనపై మనీలాండరింగ్ నియంత్రణ చట్టం కింద శనివారం అరెస్ట్ చేశారు. ఇవాళే సతీశ్ బాబును సీబీఐ స్పెషల్ కోర్టులో హాజరుపరిచారు ఈడీ అధికారులు.. దీంతో ఆయనకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.