Asianet News TeluguAsianet News Telugu

అజారుద్దీన్‌‌కు షాక్, అనర్హత వేటేసిన సుప్రీంకోర్ట్ కమిటీ .. హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీకి నో ఛాన్స్

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఎన్నికలకు ముందు మహ్మద్ అజారుద్దీన్‌కు షాక్ తగిలింది.  ఆయనపై జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటీ అనర్హత వేటు వేసింది. ఈ మేరకు హెచ్‌సీఏ ఓటర్ల జాబితా నుంచి అజారుద్దీన్ పేరును కూడా తొలగించింది. 
 

mohammad azharuddin disqualified from contesting hca elections ksp
Author
First Published Oct 5, 2023, 6:08 PM IST

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఎన్నికలకు ముందు మహ్మద్ అజారుద్దీన్‌కు షాక్ తగిలింది. ఆయన హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీ చేయకుండా సుప్రీంకోర్ట్ నియమించిన జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటీ అనర్హత వేటు వేసింది. గతంలో హెచ్‌సీఏ అధ్యక్షుడిగా వుంటూనే డెక్కన్ బ్లూస్ క్లబ్ అధ్యక్షుడిగానూ అజార్ వ్యవహరించారు. ఇది నిబంధనలు ఉల్లంఘించడమేనని పేర్కొన్న కమిటీ.. చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు హెచ్‌సీఏ ఓటర్ల జాబితా నుంచి అజారుద్దీన్ పేరును కూడా తొలగించింది. 

ఇకపోతే.. అక్టోబర్ 20 నుంచి హెచ్‌సీఏ ఎన్నికలు జరగనున్నాయి. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, ఈసీ మెంబర్స్ పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి 173 మందితో కూడిన ఓటర్ల జాబితాను ఇప్పటికే విడుదల చేశారు. అక్టోబర్ 7 నుంచి 9 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. అక్టోబర్ 14న నామినేషన్ల పరిశీలన, అక్టోబర్ 16 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. అక్టోబర్ 20న ఓటింగ్ నిర్వహించి అదే రోజున ఫలితాలను ప్రకటించనున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios