భాగ్యనగరంలో పర్యటించిన మోదీ సోదరుడు

ప్రధాని హోదాలో మోదీ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ కు వచ్చిన విషయం తెలిసిందే.జాతీయ పోలీసు అకాడమీలో జరిగిన డీజీపీల సదస్సులో పాల్గొని భద్రత, పోలీసు వ్యవస్థ పటిష్టతపై చర్చించారు.

ఈ రోజు సాయంత్రం తిరిగి దిల్లీ పయనమయ్యారు. ఈ విషయం అందిరికీ తెలిసిందే.ఈ ప్రధాని మోదీతో పాటు మరో మోదీ కూడా శనివారం హైదరాబాద్ లో సందడి చేశారు.ఆయన ఎవరో కాదు.. ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లాద్‌మోదీ.

 ఇవాళ హైదరాబాద్‌లో సాధారణ సందర్శకుడిలా ఆయన పాతబస్తీలో కలియతిరిగారు. చార్మినార్‌ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌ రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సాలార్‌జంగ్‌ మ్యూజియం, చౌమొహల్లా ప్యాలెస్‌ను సందర్శించారు.