2013-14లో దేశవ్యాప్తంగా బయటపడిన నల్లధనం విలువ రూ. 7700 కోట్లని ఆదాయపు పన్నుశాఖే గతంలో ఒకసారి వెల్లడించింది. ఇందులో నగదు రూపంలో బయటపడింది కేవలం రూ. 450 కోట్లే. మిగిలిన మొత్తమంతా భూములు, భవనాలు, ప్లాట్లు, విలువైన ఆభరణాల రూపంలో ఉన్నవే.
దేశ ప్రజలకు మరిన్ని కఫ్టాలు తప్పట్లు లేవు. ఎందుకంటే నల్లధనం వేట మున్ముందు కూడా కొనసాగుతుందని ప్రధానమంత్రి స్పష్టం చేసారు. ఏకంగా 70 ఏళ్ళ నాటి రికార్డులను కూడా వెలికి తీసి నల్లధనం కోసం వేటాడుతారని ప్రధాని చెప్పటం పట్ల పలువురు ఆశ్చర్యపోతున్నారు. నల్లధనం విషయంలోను, పెద్ద నోట్ల రద్దు విషయంలోనూ ప్రధానమంత్రి నరేంద్రమోడి మాటలకు యావత్ దేశం విస్తుపోతోంది.
జపాన్ లోపర్యటనలో ఉన్న మోడి మాట్లాడుతూ, నల్లధనం వెలికితీతపైన, పెద్ద నోట్ల రద్దు విషయంలో చేసిన హెచ్చరికలను చూసి ఆశ్చర్యపోతున్నారు. ప్రధాని రెండు విషయాలను ప్రస్తావించారు. అందులో మొదటిది నల్లధనాన్ని వెనక్కు రప్పించటం. రండోది పెద్ద నోట్ల రద్దును దేశప్రజలు స్వాగతిస్తున్నట్లు చెప్పటం.
మొదటి విషయాన్ని చూస్తే నల్లధనాన్ని రప్పించటంలో భాగంగా గడచిన 70 ఏళ్ళ క్రితం రికార్డులను కూడా బయటకు తీస్తానని చెప్పటమంటే ప్రజలను భయపెట్టటమే. అది సాధ్యమ్యేనా అని ప్రజలు విస్తుపోతున్నారు. 70 ఏళ్ళ క్రితం నాటి నల్లధనం దేశంలో ఎంతుందటున్నది ప్రశ్న. 20 ఏళ్ళ క్రితం నాటి సమాచారం కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా దొరకటం లేదు. ఏమంటే అప్పటి రికార్డులే తమ వద్ద లేవని చెప్పి అధికారులు చేతులు దులుపుకోవటం చాలా మందికి అనుభవమే. సరే ఐటి వంటి ముఖ్యమైన శాఖలు కాబట్టి మరికొన్ని సంవత్సరాల రికార్డులు దిరికితే దొరకవచ్చు.
70 ఏళ్ళంటే దాదాపు రెండు జనరేషన్లు. అప్పటి లెక్కలను ఇపుడు దుమ్ముదులిపి మోడి సాధించేది ఏముంటుందన్నది ప్రశ్న. ప్రజలను భయపెట్టటానికి కాకపోతే ఎందుకీ స్టేట్మెంట్లు.
ఇక అసలు విషయానికి వస్తే, గడచిన ఏడు దశాబ్దాల్లో కేంద్ర ప్రభుత్వాలు నాలుగు సార్లు పెద్ద నోట్లను రద్దు చేసింది. దాంతో పెద్ద నోట్లు రద్దయినప్పుడల్లా ఎంతో కొంత నల్లధనం అప్పట్లోనే బయటకు వచ్చే ఉంటుంది. పోతే, నల్లధనం దాచుకున్న వారెవరు కూడా తమ వద్ద నగదు రూపంలో ఉంచుకోరన్న సంగతి ప్రధానికి తెలియదా.
2013-14లో దేశవ్యాప్తంగా బయటపడిన నల్లధనం విలువ రూ. 7700 కోట్లని ఆదాయపు పన్నుశాఖే గతంలో ఒకసారి వెల్లడించింది. ఇందులో నగదు రూపంలో బయటపడింది కేవలం రూ. 450 కోట్లే. మిగిలిన మొత్తమంతా భూములు, భవనాలు, ప్లాట్లు, విలువైన ఆభరణాల రూపంలో ఉన్నవే. మరి అటువంటిది 70 ఏళ్ళ రికార్డులను బయటకు తీస్తానని ప్రధాని ప్రకటించటంలో ఉద్దేశ్యమేమిటో? అప్పటి రికార్దులను వెలికి తీసేందుకు అవసరమైతే ఎంతమంది సిబ్బందినైనా నియమిస్తామని ప్రధాని చెప్పటం హాస్యాస్పదమే. గడచిన ఐదు రోజులుగా దేశప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చేతగాలేదు గానీ ఎప్పటి లెక్కలో ఇపుడు తీస్తారట.
దానికితోడు పెద్ద నోట్ల రద్దును ప్రజలందరూ స్వాగతిస్తున్నారని, అందువల్ల ఎదురౌతున్న కష్టాలను దేశప్రజలు సంతోషంగా భరిస్తున్నట్లు మోడి ఇస్తున్న బిల్డప్ చూస్తుంటే దేశ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు అసలు ప్రధాని దృష్టికి వెళుతున్నాయా అన్న సందేహాలు కలుగుతోంది.
