గతేడాది కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో రవాణా సేవలు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరంలో ఎంఎంటీఎస్ రైళ్ల సేవలు నిలిచిపోయాయి. ఆ తర్వాత దశల వారీగా రవాణా సేవలు ప్రారంభమైనప్పటికీ.. ఎంఎంటీఎస్ రైళ్లు మాత్రం దాదాపు 15 నెలల నుంచి పట్టాలెక్కలేదు.
గతేడాది కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో రవాణా సేవలు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరంలో ఎంఎంటీఎస్ రైళ్ల సేవలు నిలిచిపోయాయి. ఆ తర్వాత దశల వారీగా రవాణా సేవలు ప్రారంభమైనప్పటికీ.. ఎంఎంటీఎస్ రైళ్లు మాత్రం దాదాపు 15 నెలల నుంచి పట్టాలెక్కలేదు. దీంతో నగరంలోని ఉద్యోగులు, సామాన్యులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చాలా మంది 5, 10 రూపాయల అతి తక్కువ చార్జీలతో ఎంఎంటీఎస్ రైళ్ల ద్వారా నగరంలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణించేవారు. ఇప్పుడు ఎంఎంటీఎస్ సేవలు అందుబాటులో లేకపోవడం వల్ల భారీగా డబ్బులు ఖర్చు చేసి గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన పరిస్థితి. అలాగే ప్రయాణానికి చాలా సమయం పడుతోంది. ఇలాంటి సమయంలో ఎంఎంటీఎస్ రైళ్ల ప్రారంభానికి సంబంధించి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నగరవాసులకు గుడ్‌న్యూస్ చెప్పారు. వచ్చే వారం నుంచి నగరంలో ఎంఎంటీఎస్ సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు.
Also Read:అంతర్రాష్ట్ర సర్వీసులకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్.. రేపటి నుంచి ఏపీకి బస్సులు
కాగా అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. తెలంగాణలో లాక్‌డౌన్ ఎత్తివేతతో ఇతర రాష్ట్రాలకు సర్వీసులు నడవనున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో రేపట్నుంచి ఏపీకి బస్సులు నడపనుంది టీఎస్ఆర్టీసీ. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఏపీకి తెలంగాణ బస్సులు నడవనున్నాయి. అలాగే ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కర్ణాటకలోకి తెలంగాణ బస్సులు నడుస్తాయి.
కాగా, తెలంగాణలో లాక్‌డౌన్ ఎత్తివేస్తూ శనివారం కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పూర్తిగా నియంత్రణలోకి రావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అన్ని రకాల ఆంక్షల్ని, నిబంధనల్ని పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో కరోనా కేసులు, పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గాయని కేబినెట్ అభిప్రాయపడింది. వైద్య ఆరోగ్య శాఖ నివేదికను పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
