Asianet News TeluguAsianet News Telugu

రైల్లో పుట్ బోర్డింగ్...ప్రమాదానికి గురై యువకుడి మృతి

బస్సుల్లోనూ, రైళ్లలోనూ విద్యార్థులు, యువకులు ప్రవేశ ద్వారాల వద్ద నిల్చుని ప్రయాణిస్తుంటారు. దాన్ని సరదాగా భావిస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ఇలా ప్రయాణించడం ఎంత ప్రమాదకరమో ఇతరులు చెబుతున్నా వినిపించుకోరు. ఈ పుట్ బోర్డింగ్ వల్ల ఎన్ని ప్రమాదాలు జరిగినా వారిలో మార్పు మాత్రం రావడం లేదు. తాజాగా ఓ యువకుడు రైల్లో పుట్ బోర్డింగ్ చేస్తూ ప్రమాదానికి గురై మరణించాడు. ఈ దుర్ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

MMTS Train accident in hyderabad

హైదరాబాద్ లో సిటీ ప్రయాణికుల కోసం రైల్వే శాఖ ఎంఎంటీఎస్ రైళ్లను నడుపుతోంది. అయితే ఈ రైల్లు ఉదయం, సాయంత్రం సమయాల్లో ప్రయాణికులతో కిక్కిరిసి ప్రయాణిస్తుంటాయి. ఇలా రద్దీ సమయంలో నాంపల్లి రైల్వే స్టేషన్ ఓ యువకుడు రైలెక్కాడు. అతడు రైలు ప్రవేశ ద్వారం వద్ద నిలబడి ప్రమాదకరంగా ప్రయాణిస్తూ హపీజ్ పేట్ వద్ద ప్రమాదానికి గురయ్యాడు. రైల్లోంచి కిందపడిపోడటంతో తలకు, శరీర భాగాలకు తీవ్ర గాయాలై యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.   

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికి యువకుడు చనిపోయి ఉన్నాడు. దీంతో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు నాంపల్లి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 
Follow Us:
Download App:
  • android
  • ios