జోగు రామన్నకు కేసిఆర్ మీద మరీ ఇంత అభిమానమా ?

mminister jogu ramanna fire on pcc uttam kumar reddy
Highlights

ఫుల్ జోష్

తెలంగాణ అటవీ, బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్నకు కేసిఆర్ మీద ఉన్న అభిమానం అంతా ఇంతా కాదని నిరూపించుకున్నారు. ఆదిలాబాద్ ఆయన  మీడియా సమావేశంలో మాట్లాడారు. కేసిఆర్ మీద అభిమానం కురిపించారు. తెలంగాణ రాష్ట్రంలో మరో 20 ఏళ్ల వరకు కేసిఆర్ ను గద్దె దింపడం ఎవరి తరం కాదని సవాల్ చేశారు. ఉత్తమ్  కుమార్ రెడ్డి మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉత్తమ్ చేసేది బస్సు యాత్ర కాదని, జనానికి నరక యాత్ర అని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ మోసాలు పాపాలు లంచాల పార్టీ అని ఎద్దేవా చేశారు. ఫారెస్టు భూములు లాక్కుంటున్నారని పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతల మాటలు జనాలెవరూ నమ్మరు అని తేల్చి పారేశారు. ప్రాణహిత చేవెళ్ళపై కాంగ్రెస్ నేతలు తెలివి లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు.  తమ ప్రభుత్వ పాలనపై అధ్యక్షలు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుందన్నారు. 70 ఏళ్ల పాలనలో రాష్టాన్ని దారిద్ర్య రేఖకు తీసుకెళ్లారని విమర్శించారు. రాజకీయ లబ్ది కోసమే తమ పై కాంగ్రెస్ నేతల దుష్ట ప్రచారం చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ ను విమర్శిస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి కబర్దార్  అని మంత్రి హెచ్చరించారు.

 

loader