చౌటుప్పల్: తెలంగాణ రాష్ట్రంలోని చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ఫ్లాజా వద్ద ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది.  సిబ్బంది అత్యుత్సాహంతో  ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి వాహనాన్ని అడ్డుకున్నారు.టోల్ ఫీజ్ చెల్లించి వెళ్లాలని సిబ్బంది పట్టుబట్టారు. 

తాను ఎమ్మెల్సీనని చెప్పి.. ఐడి కార్డు చూపించినా వారు అనుమతించలేదు. గన్ మెన్ లేకపోవడంతో ఎమ్మెల్సీ అనుకోలేదని మొదట సిబ్బంది చెప్పారు. తర్వాత టోల్ మినహాయింపు జాబితా లో ఎమ్మెల్సీ పేరు లేదంటూ బుకాయించారు. సమాచారం తెలిసి అనుమతించాలని ఉన్నతాధికారుల ఆదేశించారు. 

అసలు ఏ ఎమ్మెల్సీని ఆపకుండా తనను మాత్రమే ఎందుకు ఆపారో సమాధానం చెప్పాలని నర్సిరెడ్డి పట్టుబట్టారు. సిబ్బంది తీరుకు నిరసనగా టోల్ ఫ్లాజా వద్ద ఆయన బైఠాయించారు.