Asianet News TeluguAsianet News Telugu

MLC Kavitha: "ఇదే కేసీఆర్ కు రైతుల మీద ఉన్న ప్రేమ‌, చిత్త‌శుద్ధి"

Telangana Elections: కాంగ్రెస్ పార్టీపై ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. మోసపూరిత హామీలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ అని ధ్వజమెత్తారు. 

MLC Kavitha reacts on Karnataka minister ramalinga reddy comments KRJ
Author
First Published Nov 3, 2023, 5:38 PM IST

Telangana Elections: ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. అన్ని పార్టీలు ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. అవకాశం దొరికితే చాలు..  అధికార విపక్షాలు పోటా పోటీగా విమర్శ, ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీపై ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. మోసపూరిత హామీలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ అని ధ్వజమెత్తారు. 

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. కర్నాటకలో లాగా.. కరెంట్ కష్టాలు పునరావృతం అవుతాయని, ఇటీవల కర్నాటక రాష్ట్ర మంత్రి రామలింగా రెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇందుకు సాక్ష్యమని అన్నారు. కర్నాటకలో కేవలం ఐదు గంటల పాటు మాత్రమే విద్యుత్తును సరఫరా చేస్తున్నామని ఆ రాష్ట్ర మంత్రి రామలింగా రెడ్డి వ్యాఖ్యాలను హైలెట్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ లో ఓ వీడియో పోస్టు చేశారు. ఆ వీడియో కర్నాటకలో వ్యవసాయానికి కేవలం 5 గంటల మాత్రమే విద్యుత్తు ఇస్తున్నట్టు ఆ రాష్ట్ర మంత్రి పేర్కొన్నారు. 

కాంగ్రెస్ రైతుల ఉసురు తీసుకుందని, ఇప్పుడు మరోసారి మభ్యపెట్టడానికి బయలుదేరిందని పేర్కొన్నారు. క‌ర్నాట‌క మంత్రే ఒప్పుకున్నాడనీ,  తాము కేవలం 5 గంట‌లే కరెంట్ ఇస్తున్నామని, ఒక్క వేళ క‌రెంటు కొనుగోలు చేసి తాము 7 గంట‌ల ఇస్తామంటున్నారని మండిపడ్డారు. త‌ప్పుడు హామీల‌కు కేరాఫ్ అడ్ర‌స్ కాంగ్రెస్ అని విమర్శించారు. కానీ, తెలంగాణ‌లో సీఎం కేసీఆర్ 24 గంట‌ల పాటు క‌రెంటు ఇస్తుందనీ, ఇది కేసీఆర్ కు రైతుల మీద ఉన్న ప్రేమ‌, చిత్త‌శుద్ధి అని పేర్కోన్నారు. కాంగ్రెస్ పార్టీకి రైతుల పట్ల ఎటువంటి మమకారం లేదని మండిపడ్డారు.

Follow Us:
Download App:
  • android
  • ios