ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంత్ సేవాలాల్ 282వ జయంతి ఉత్సవాల్లో  పాల్గొన్నారు. తారక రామ్ నగర్ కాలనీ కమ్యూనిటీ హాల్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గణేష్ గుప్తాతో కలిసి ఆమె హాజరయ్యారు. 

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంత్ సేవాలాల్ 282వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. తారక రామ్ నగర్ కాలనీ కమ్యూనిటీ హాల్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గణేష్ గుప్తాతో కలిసి ఆమె హాజరయ్యారు. 

"

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ గిరిజనుల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయుడు సంత్ సేవాలాల్ అని కొనియాడారు. అంతేకాదు సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం నా అదృష్టం అని చెప్పుకొచ్చారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి బంజారాల పట్ల అపారమైన గౌరవం, ప్రేమ ఉన్నాయని చెప్పుకొచ్చారు. దీనికి నిదర్శనమే తెలంగాణ ఏర్పడిన తర్వాత సేవాలాల్ జయంతి అధికారికంగా నిర్వహించడం అన్నారు. ఇది ఎంతో గర్వకారణం అని చెప్పుకొచ్చారు.