MLC Kavitha: ప్రజలెవరూ కరెంట్ బిల్లులు కట్టొద్దు..ఎమ్మెల్సీ కవిత సంచలన కామెంట్స్
MLC Kavitha: నెలవారీ 200 యూనిట్లలోపు విద్యుత్ బిల్లులు చెల్లించవద్దని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రజలకు సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు విద్యుత్ బిల్లులను మాఫీ చేస్తామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చిందని ఆమె తెలిపారు. ఇప్పటికిప్పుడు కరెంటు బిల్లులు వస్తే కట్టాల్సిన అవసరం లేదని ప్రజలకు చెప్పింది.
MLC Kavitha: తెలంగాణలో నూతనంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ .. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై స్పెషల్ ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమలు చేస్తున్న రేవంత్ సర్కార్.. మిగిలిన నాలుగు గ్యారెంటీల అమలు కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. ప్రజా పాలన పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి.. లబ్ధదారుల నుంచి దరఖాస్తులు తీసుకునేందుకు కార్యచరణను రూపొందించింది. ఈకార్యక్రమం డిశంబర్ 28 నుంచి ప్రారంభం కానుంది.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను త్వరగా అమలు చేయాలన్నారు. ఈ క్రమంలో రేవంత్ సర్కార్ కు పలు సూచనలు చేశారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండు, మూడు అంశాల పట్ల గ్రామాల్లో ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ అంశాలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తునని అన్నారు. రాష్ట్రంలో 44 లక్షల మంది పెన్షన్ దారులు వున్నారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ విధంగా పెన్షన్ దారులు మరో సారి .. కొత్త అప్లికేషన్ పెట్టుకునే అవసరం లేకుండా వారికి 4 వేల రూపాయల పెన్షన్ జనవరి 1వ తారీకు నుండి యధావిధిగా ఇవ్వాలని రేవంత్ సర్కార్ కు సూచించారు. ఈ విధంగా చేయడం వల్ల ఉద్యోగులకు పెద్ద ఎత్తున పని భారం తగ్గుతుందనీ, పెన్షన్ దారులకు కూడా ఇక్కట్లు తప్పుతాయని అన్నారు. ఇదివరకే ప్రతి గ్రామంలో దాదాపుగా ఉన్నటువంటి మీసేవ కేంద్రాలలో ఈ వివరాలన్నీ కూడా ఉన్నాయనీ, ప్రభుత్వ పథకాలు పొందుతున్నా వారి పూర్తి వివరాలు కూడా అందులో పొందుపరిచి ఉన్నాయని తెలిపారు. కాబట్టి వాటిని తీసుకొని తక్షణమే.. అర్హులకు పథకాలను అందజేయాలని సూచించారు.
అలాగే.. నిరుద్యోగ భృతికి సంబంధించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ ఇచ్చిందో.. దానికి సంబంధించి వివరాలు ఎక్కడ పొందుపరచలేదని, నిరుద్యోగులకు కూడా న్యాయం చేకూరే విధంగా చర్చలు తీసుకోవాలని, ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలిపారు. అదేవిధంగా మీ సేవ కేంద్రాలలో ఇదివరకే పెండింగ్ ఉన్నటువంటి రేషన్ కార్డులు అప్లికేషన్లు త్వరితగతిన పూర్తి చేసి.. ముందుగా రేషన్ కార్డులు అందరికీ అందించాలని, అప్పుడే ప్రభుత్వ పథకాలు అందరికి వస్తాయని అన్నారు.
అలాగే.. జనవరి ఒకటో తారీకు నుండి 200 వరకు కరెంట్ ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. దీని ప్రకారం కొత్త సంవత్సరం జనవరి 1 నుండి దీనిని అమలు చెయ్యాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. నెలవారీ 200 యూనిట్లలోపు విద్యుత్ బిల్లులు చెల్లించవద్దని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రజలకు సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు విద్యుత్ బిల్లులను మాఫీ చేస్తామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చిందని ఆమె తెలిపారు. ఇప్పటికిప్పుడు కరెంటు బిల్లులు వస్తే కట్టాల్సిన అవసరం లేదని ప్రజలకు చెప్పింది.