Asianet News TeluguAsianet News Telugu

ఈ సారి బీజేపీ మొత్తం 119 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోతుంది..: ఎమ్మెల్సీ కవిత

బీజేపీ, కాంగ్రెస్‌లపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ119 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోతుందని విమర్శించారు.

MLC Kalvakuntla Kavitha Says BJP Will lose deposits in all 119 seats ksm
Author
First Published Oct 16, 2023, 10:27 AM IST

బీజేపీ, కాంగ్రెస్‌లపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మొత్తం 119 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోతుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కూడా తమకు పోటీ  కాదని అన్నారు. కవిత ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల తమకు చాలా సంతోషంగా, గర్వంగా ఉందని చెప్పారు. ఇది రాష్ట్రాన్నే కాకుండా దేశాన్ని పలు దిశల్లో ముందుకు తీసుకెళ్లే మేనిఫెస్టో అని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంమంచి విధాన రూపకల్పనలో ఉందని.. ఇప్పుడు కూడా దానిని కొనసాగించామని చెప్పారు. మేనిఫెస్టో తమ పార్టీ అధినేత కేసీఆర్ మనస్సును చాలా స్పష్టంగా ప్రతిబింబిస్తుందని అన్నారు.

బీజేపీ తమ పథకాల నుంచి నేర్చుకుంటుందని కవిత అన్నారు. దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రభుత్వ స్కీమ్‌లను అమలు చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ స్కీమ్‌లను కేంద్రంలోని బీజేపీ సర్కార్ కూడా స్పూర్తిగా తీసుకుంటుందని అన్నారు. బీజేపీ నిబద్దత ఉంటే.. రాష్ట్రాభివృద్దిని అడ్డంకులు సృష్టించవద్దని కోరారు. బీజేపీ గతంలో చాలా స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిందని... ఈసారి ఆ పార్టీ మొత్తం 119 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోతుందని కచ్చితంగా చెప్పగలమని అన్నారు.

బీఆర్‌ఎస్ మేనిఫెస్టో వెలువడగానే బీజేపీ, కాంగ్రెస్‌  పార్టీలు భయాందోళనకు చెందుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ ఇస్తున్న హామీలు టిష్యూ పేపర్లు మాత్రమేనని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే గ్యారెంటీ ఎక్కడా లేదని... ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ ఇస్తున్న హామీలు టిష్యూ పేపర్లు తప్ప మరేమీ కావని కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు.  

Follow Us:
Download App:
  • android
  • ios