Asianet News TeluguAsianet News Telugu

ఆ దివ్యాంగులకు కవిత ఉగాది కానుక.. అండగా ఉంటానని హామీ..

వివిధ జిల్లాలకు చెందిన ఏడుగురు దివ్యాంగులకు ఎమ్నెల్సీ కల్వకుంట్ల కవిత మూడు చక్రాల స్కూటీలను అందజేశారు. ‌సోషల్ మీడియా ద్వారా తమ‌ సమస్యలను దివ్యాంగులు ఎమ్మెల్సీ కవిత దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే స్పందించిన కవిత వారికి సహాయం అందించారు. 

mlc kalvakuntla kavitha donates three wheeler bikes to handicapped - bsb
Author
Hyderabad, First Published Apr 13, 2021, 4:49 PM IST

వివిధ జిల్లాలకు చెందిన ఏడుగురు దివ్యాంగులకు ఎమ్నెల్సీ కల్వకుంట్ల కవిత మూడు చక్రాల స్కూటీలను అందజేశారు. ‌సోషల్ మీడియా ద్వారా తమ‌ సమస్యలను దివ్యాంగులు ఎమ్మెల్సీ కవిత దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే స్పందించిన కవిత వారికి సహాయం అందించారు. 

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి గొప్ప మనసును చాటుకున్నారు. వివిధ కారణాలతో దివ్యాంగులుగా మారిన పలువురికి మూడు చక్రాల స్కూటీని‌ అందించి, ఉగాది పర్వదినాన వారి జీవితాల్లో నూతనోత్తేజాన్ని నింపారు. 

హైదారాబాద్ పురానాపూల్ కు చెందిన సూర్య ప్రకాష్, కుత్బుల్లాపూర్ కు చెందిన సయ్యద్ సలీం, సిరిసిల్ల కు చెందిన పోచంపల్లి శ్రీనివాస్, శేఖర్, ఖానాపూర్ కు చెందిన సుధాకర్, వరంగల్ రూరల్ కు చెందిన భరత్, షబానాలను వీధి వెక్కరించి, దివ్యాంగులుగా మారారు. తన‌ పరిస్థితి సోషల్ మీడియా ద్వారా ఎమ్మెల్సీ కవిత దృష్టికి తీసుకెళ్లి, సాయం చేయాలని కోరారు. 

ట్విట్టర్ ద్వారా దివ్యాంగుల దీన స్థితి గురించి తెలుసుకున్న ఎమ్మెల్సీ కవిత, వెంటనే స్పందించారు. వారితో నేరుగా మాట్లాడి అండగా ఉంటానని ‌హామీ ఇచ్చారు. మంగళవారం ఉగాది సందర్భంగా హైదరాబాద్ లో ఏడుగురు దివ్యాంగులు ఎమ్మెల్సీ కవితను కలిసారు. 

ఈ ఏడుగురు దివ్యాంగులకు మూడు చక్రాల స్కూటీలను అందించి తన గొప్ప మనసు చాటుకున్నారు కవి. అంతేకాదు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే తనను సంప్రదించాలని వారికి భరోసానిచ్చారు. కోరిన వెంటనే స్పందించి, సాయం అందించిన ఎమ్మెల్సీ కవితకు దివ్యాంగులు కృతజ్ఞతలు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios