తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. వరంగల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. రంగారెడ్డిలో 811 మంది ఓటర్లు, నల్గొండలో 1096 మంది ఓటర్లు, వరంగల్‌లో 902 మంది ఓటర్లు ఉన్నారు.

రంగారెడ్డిలో టీఆర్ఎస్ అభ్యర్ధిటా మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్తిగా కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి.. నల్గొండలో టీఆర్ఎస్ అభ్యర్థిగా తేరా చిన్నపరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్ధిగా కోమటిరెడ్డి లక్ష్మీ ... వరంగల్‌లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్ధిగా వెంకట్రామిరెడ్డితో పాటు మరో ముగ్గురు స్వతంత్రులు బరిలో ఉన్నారు. వచ్చే నెల 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు.