దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారిని తరిమికొట్టే ప్రక్రియలో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో వారానికి నాలుగు రోజుల చొప్పున వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నారు. వ్యాక్సినేషన్ రెండో దశలో ప్రజాప్రతినిధులు కూడా టీకాలు వేసుకోనున్నారు.
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారిని తరిమికొట్టే ప్రక్రియలో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో వారానికి నాలుగు రోజుల చొప్పున వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నారు. వ్యాక్సినేషన్ రెండో దశలో ప్రజాప్రతినిధులు కూడా టీకాలు వేసుకోనున్నారు.
ఈ నేపథ్యంలో సోమవారం నుంచి రాష్ట్రంలో ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రైవేట్ ఆస్పత్రుల వైద్య సిబ్బందికి కరోనా టీకా పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కరోనా టీకా తీసుకున్నారు.
జగిత్యాలలోని జిల్లా ప్రధాన ఆస్పత్రిలో సోమవారం ప్రైవేటు వైద్య సిబ్బందికి టీకా పంపిణీని ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే కూడా టీకా వేసుకున్నారు. ఆయనకు ఆస్పత్రి వైద్యులు అత్యంత జాగ్రత్తతో టీకా వేశారు. ఈ సందర్భంగా కొన్ని జాగ్రత్తలు సూచించారు.
మొదట కోవిడ్ వారియర్స్ ఉన్న వారికి టీకా వేసిన అనంతరం ప్రాధాన్య క్రమంలో అందరికీ టీకాలు వేస్తారని ఈ సందర్భంగా డాక్టర్ సంజయ్ కుమార్ తెలిపారు. వైద్యుడిగా ఉన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గతంలో కరోనా రోగులకు చికిత్స అందించి అందరి ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే.
రాష్ట్రంలో బుధ, శనివారాలు మినహా రోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. దాదాపు 5 వేల ప్రైవేటు దవాఖానల్లో టీకా పంపిణీ మొదలైంది. మరికొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు వ్యాక్సిన్ వేసుకోనున్నారు. రెండో దశలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు కూడా టీకా తీసుకోనున్నారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 25, 2021, 2:07 PM IST