వారికి అడ్డురాని రూల్స్ .. మాకు ఎందుకు అడ్డుగా మారుతున్నాయి .. Raja Singh ఆగ్ర‌హం

తెలంగాణ రాష్ర బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ చేపట్టిన జన జాగరణ దీక్షను పోలీసులు అడ్డుకోవ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బీజేపీ నేత‌ల‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను అక్ర‌మంగా అరెస్ట్ చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  నూత‌న సంవత్స‌ర వేడుక‌ల్లో భాగంగా అర్థ‌రాత్రి వ‌ర‌కు వైన్స్, బార్లను ఓపెన్ చేసిపెట్ట‌డం.  లక్షలాది ప్రజ‌లు తరలివచ్చే నాంపల్లి ఎగ్జిబిషన్‌కు ప్రభుత్వం అనుమతి ఇవ్వ‌డంలోనే కరోనా రూల్స్ .. బీజేపీ నేత‌లు చేస్తున్న‌ దీక్షకు ఎందుకు అడ్డు వ‌చ్చాయ‌ని రాజాసింగ్ ప్రశ్నించారు. 
 

Mla Raja Singh Warns Trs Government Over Bandi Sanjay Issue

Raja Singh : ప్ర‌భుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన కేసీఆర్ ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన  జీవో నెం 317 ను వెంట‌నే ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ‌య్  జన జాగరణ దీక్ష  తలపెట్టిన విష‌యం తెలిసిందే.  అయితే.. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో జన జాగరణ దీక్షకు అనుమతులు లేవని పోలీసులు స్పష్టం చేశారు. ఈ క్ర‌మంలో బీజేపీ నేత‌ల‌ను,  కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. దీక్ష‌ను అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. క‌రీంన‌గ‌ర్ పోలీసుల‌ చ‌ర్య‌ను బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజసింగ్ ఖండించారు. 

బీజేపీ కార్యాలయంలో దీక్ష చేస్తుంటే..  పోలీసులు అడ్డుకోవ‌డం స‌రికాద‌నీ, త‌మ నేత‌ల‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను అక్ర‌మంగా అరెస్ట్ చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. క‌రీంనగర్ వెళ్తుంటే.. త‌న‌ని కూడా  పోలీసులు అడ్డుకున్నారని రాజాసింగ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తిని అడ్డుకట్ట వేసేందుకు నూతన సంవత్సర వేడుకలపై అనేక ఆంక్షలు విధిస్తుంటే, కేసీఆర్ స‌ర్కార్ మాత్రం.. అర్థ‌రాత్రి వ‌ర‌కు వైన్స్, బార్లను ఓపెన్ చేసిపెట్టేలా అవ‌కాశ‌మిచ్చింది. అలాగే.. తన నియోజకవర్గమైన గోషామహల్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌కు ప్రభుత్వం అనుమతినిచ్చిందని.. ఈ ఎగ్జిబిషన్‌కు లక్షలాదిగా ప్రజలు తరలివస్తారని అన్నారు. దీంతో కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. అక్క‌డ లేని కోవిడ్ నిబంధనలు .. బీజేపీ నేత‌లు చేస్తున్న‌ దీక్షకు ఎందుకు అడ్డు వ‌చ్చాయ‌ని రాజాసింగ్ ప్రశ్నించారు. 

Read Also: తెలంగాణలో కొత్తగా ఐదు ఒమిక్రాన్ కేసులు.. 84కి చేరిన బాధితుల సంఖ్య

మంత్రి కేటీఆర్, ఇత‌ర‌ తెరాస మంత్రులు సభలు, సమావేశాలు పెడితే వేలాదిమంది కార్యకర్తలు వస్తున్నారని, అక్క‌డ లేని క‌రోనా నిబంధ‌న‌లు.. బీజేపీ నేత‌లు దీక్ష చేప‌డితే.. గుర్తుకు వ‌స్తున్నాయా అని నిలదీశారు. అంటే.. తెరాస నేత‌ల‌కు ఒక రూల్, మాకు మరొక రూలా? అంటూ  ప్ర‌శ్నించారు.  తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారని, సరైన సమయంలో ప్రజలు బుద్ధి చెబుతారని రాజాసింగ్ విమ‌ర్శించారు. 
 
 ప్ర‌భుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల త‌ల నొప్పిగా మారిన జీవో నెం. 317 ను వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జన జాగరణ దీక్ష చేప‌ట్టారు. ఈ దీక్ష‌లో భాగంగా..  రేపు ఉదయం 5 గంటల వరకూ నిద్రపోకుండా జాగరణ దీక్ష చేపట్టారు సంజయ్.  ఈ దీక్ష‌కు వేదిక‌గా మారింది కరీంనగర్‌లోని ఎంపీ బండి సంజయ్ కార్యాలయం. ఆయ‌న కార్యాల‌యంలో ఏర్పాట్లు చేస్తున్న పార్టీ నేతలు.

Read Also: నేను టీఆర్ఎస్ ఏజెంట్‌నట.. కేటీఆర్‌తో కాంగ్రెస్ నేతలు కలవలేదా : జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

అయితే.. ఈ దీక్ష‌కు అనుమ‌తులు లేవ‌ని .. రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ ఆంక్షాలు అమ‌ల్లో ఉన్నాయ‌ని దీక్షా శిబిరాన్ని ఖాళీ చేయాలని పోలీసులు బీజేపీ శ్రేణులకు సూచించారు. దీక్ష‌కు వ‌స్తున్న నేత‌లు, కార్య‌క‌ర్త‌లను అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు పోలీసులు. ఇప్ప‌టికే ప‌లువురు  పార్టీ జిల్లా అధ్యక్షుడు కృష్ణా రెడ్డితో సహా పలువరు నేతలను అరెస్టు చేశారు. ఎంపీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లి మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు.  ఈ క్ర‌మంలో ఎంపీ బండి సంజయ్‌ పోలీసుల కళ్లు గప్పి బైక్ పై ఎంపీ క్యాంపు కార్యాలయం దగ్గరికి చేరుకున్నారు. పోలీసులు ఆయన్ను చుట్టుముట్టారు. పోలీసుల వలయాన్ని ఛేదించుకుని ఆయన కార్యాలయంలోకి వెళ్లారు. దీంతో కరీంనగర్‌లో హైటెన్షన్ నెలకొంది. బీజేపీ శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల జులుం నశించాలంటూ కమలం పార్టీ శ్రేణులు నినాదాలతో హోరెత్తించాయి.

Read Also: దారుణం: న్యూఇయర్ వేడుకల్లో ఘర్షణ.. కేక్ కట్ చేసే కత్తితోనే మిత్రుడిని

పోలీసులు త‌న‌ దీక్షను అడ్డుకోవడాన్ని బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. నల్గొండలో సీఎం కేసీఆర్‌ సభకు అనుమతి ఇచ్చిన పోలీసులు..  బీజేపీ నేత‌లు చేస్తున్న ఈ దీక్ష‌కు ఎందుకు అనుమ‌తించ‌లేద‌ని  ప్రశ్నించారు. 317జీవో వల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం జరుగుతోందని, సొంత జిల్లాలో కూడా పరాయి వాడిగా ఉండాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. జీవోను సవరించి, అందుకు అనుగుణంగా బదిలీల ప్రక్రియ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. వారికి న్యాయం జరిగే వరకు ఊరుకునే ప్రసక్తే లేదని, ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు పెట్టినా దీక్ష కొనసాగిస్తానని తేల్చి చెప్పారు. ఈ క్ర‌మంలో ప్రభుత్వ అనుమతి లేనందున మీడియా కవరేజ్‌ ఇవ్వొద్దని సీపీ కోరారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios