Asianet News TeluguAsianet News Telugu

నేను టీఆర్ఎస్ ఏజెంట్‌నట.. కేటీఆర్‌తో కాంగ్రెస్ నేతలు కలవలేదా : జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఇతర పార్టీలకు చెందిన  నేతలు ఎదురుపడ్డప్పుడు మాట్లాడుకోవడం సంస్కారమని టీపీసీసీ (tpcc) వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి (jagga reddy) అన్నారు. ఇటీవల కేటీఆర్‌తో (ktr) సంభాషణపై క్లారిటీ ఇచ్చారు. తాను కేటీఆర్ కోవర్ట్‌ని అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు. కేటీఆర్‌ను కలిసిన కాంగ్రెస్ (congress) నేతలు లేరా అని ఆయన ప్రశ్నించారు. 

tpcc working president jagga reddy fires on fake news
Author
Hyderabad, First Published Jan 2, 2022, 5:43 PM IST

ఇతర పార్టీలకు చెందిన  నేతలు ఎదురుపడ్డప్పుడు మాట్లాడుకోవడం సంస్కారమని టీపీసీసీ (tpcc) వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి (jagga reddy) అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇటీవల కేటీఆర్‌తో (ktr) సంభాషణపై క్లారిటీ ఇచ్చారు. తాను కేటీఆర్ కోవర్ట్‌ని అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు. కేటీఆర్‌ను కలిసిన కాంగ్రెస్ (congress) నేతలు లేరా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో వ్యక్తిగత పంచాయతీలు లేవని జగ్గారెడ్డి పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఏజెంట్‌నని ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. లీకులపై కాంగ్రెస్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని జగ్గారెడ్డి ప్రశ్నించారు.

కాంగ్రెస్‌లో చిల్లర బ్యాచ్ తయారైందని.. పోవాలనుకుంటే డైరెక్ట్‌గా టీఆర్ఎస్‌లోకే (trs) వెళ్లిపోతానని ఆయన స్పస్టం చేశారు. పీసీసీ అంటే చాలా బాధ్యత గల పోస్ట్ అని జగ్గారెడ్డి హితవు పలికారు. పార్టీని నాశనం చేస్తున్నాది నేనా...? ఓ వ్యక్తి అభిమాన సంఘాలా..? అని ఆయన ప్రశ్నించారు. ప్రయాణికులంతా డ్రైవర్‌పై ఆధారపడి వుంటారని.. ప్రమాదం జరిగితే డ్రైవర్‌తో పాటు ప్రయాణికులు చనిపోతారని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. పీసీసీ చీఫ్ కాంగ్రెస్‌కు డ్రైవర్‌లాంటి వారేనని ఆయన అన్నారు. మేమంతా ప్రయాణికులమేనని.. డ్రైవర్ పోస్ట్ బాధ్యత గలదని జగ్గారెడ్డి సూచించారు. కేటీఆర్ తన భుజంపై చేయి వేశారని.. నేను ఆయన భుజంపై చేయి వేయలేదన్నారు. 

Also Read:టార్గెట్ టీపీసీసీ చీఫ్ .. దీన్ని ఏమంటారు, శశిథరూర్‌పై రేవంత్ వ్యాఖ్యల్ని చిన్నారెడ్డికి పంపిన జగ్గారెడ్డి

కాగా.. రేవంత్ రెడ్డి టార్గెట్‌గా జగ్గారెడ్డి నిన్న మరో ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు శనివారం టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డికి జగ్గారెడ్డి లేఖ రాశారు. శశిథరూర్‌పై (shashi tharoor)గతంలో రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌ వీడియోను చిన్నారెడ్డికి పంపారు జగ్గారెడ్డి. పార్టీ సీనియర్ నేతపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను క్రమశిక్షణ ఉల్లంఘనగా పరిగణించాలని జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. రేవంత్‌పై తానే ఫిర్యాదు చేస్తున్నానని.. ఆయనకు షోకాజ్ నోటీసులివ్వాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. శశిథరూర్‌ని రేవంత్ అలా మాట్లాడటం తప్పుకాదా అని ఆయన ప్రశ్నించారు. పార్టీలో రేవంత్ ఒంటెద్దు పోకడపోతున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. రేవంత్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు క్రమశిక్షణ కమిటీకి కనపడటం లేదా అని ఆయన ప్రశ్నించారు. 

జగ్గారెడ్డి వ్యవహారం టీపీసీసీలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. క్రమశిక్షణ ఉల్లంఘించారని కమిటీ భావిస్తున్నట్టు పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌ చిన్నారెడ్డి (chinna reddy) చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. దీనిపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. రాజకీయ వ్యవహారాల కమిటీలో చర్చించకుండా పార్టీ కార్యక్రమాలపై ప్రకటనలు చేస్తున్న పీసీసీ (tpcc chief) అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని (revanth reddy) కూడా కమిటీ ముందుకు పిలవాలని డిమాండ్ చేశారు. అప్పుడే తాను కమిటీ ముందు హాజరవుతానని తేల్చి చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios