గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

కరుడగట్టిన హిందుత్వవాది కూడా చేయని వ్యాఖ్యలు చేస్తూ హైదరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తరచూ వార్తల్లోకి ఎక్కుతుంటారు.

స్థానికంగా ఉన్న బీజేపీ నేతలు కాస్త మితవాద హిందూ భావాలతో కనిపిస్తుంటారు. కానీ, రాజాసింగ్ అలా కాదు.

పలుసార్లు ఆయన నోటికి తాళం వేయడానికి బీజేపీ పెద్దలు ప్రయత్నించినా ఆయన ముందు వారి పప్పులు ఉడకలేదు. బీజేపీ లో కీలక నేత అయిన కిషన్ రెడ్డి తోనూ ఆయనకు పొసగదు.

ఇదంతా పక్కన పెడితే మరోసారి ఆయన సంచలన వ్యాఖ్యలతో బీజేపీ నేతలకు షాక్ ఇచ్చారు.’రామమందిరం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా, ఇతరుల ప్రాణాలు తీయడానికైనా సిద్ధమే. వచ్చే శ్రీరామనవమిలోగా రామమందిరాన్ని కట్టితీరుతాం’ అని ప్రకటించారు.

ఇప్పటికే ఆయన మాటల దాటిని తట్టుకోలేక పోతున్న తెలంగాణ బీజేపీ నేతలు ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో చూడాలి.

https://www.facebook.com/RajaSinghOfficial/videos/714618138699113/