రంజాన్ పేరిట మార్కెట్లలో తిరుగుతున్నారు.. మండిపడ్డ రాజాసింగ్
ముస్లిం లు బయటకు వచ్చేందుకు ఎవరు అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. ఓల్డ్ సిటీ లొనే కరోన పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని ఆరోపించారు. ముస్లిం సోదరులను విమర్శించలనేది మా ఉద్దేశ్యం కాదని స్పష్టం చేశారు.
పాత బస్తీలో లాక్ డౌన్ సరిగా పాటించడం లేదని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మండిపడ్డారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. రంజాన్ సందర్భంగా వందలాది మంది ముస్లింలు మార్కెట్లకు వస్తున్నారని ఆయన అన్నారు.
మొహంజాయి మార్కెట్ , ఉస్మాన్ గంజ్ , తరితర ఏరియాల్లో నిత్యం ముస్లిం సోదరులు బయటకు వస్తున్నారని చెప్పారు. హిందూ పండుగలు ఉగాది , శ్రీరామ నవమి , హనుమాన్ జయంతి లను హిందువులు ఇంట్లో లోనే ఉంది జరుపుకున్నారని గుర్తు చేశారు.
ముస్లిం లు బయటకు వచ్చేందుకు ఎవరు అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. ఓల్డ్ సిటీ లొనే కరోన పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని ఆరోపించారు. ముస్లిం సోదరులను విమర్శించలనేది
మా ఉద్దేశ్యం కాదని స్పష్టం చేశారు.
ఓల్డ్ సిటీ లో లాక్ డౌన్ పై చాలాసార్లు ముఖ్యమంత్రి , డిజిపి , హైదరాబాద్ సిపి లకు లేఖ రాశానని చెప్పారు. అయితే.. చర్యలు మాత్రం తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి ముస్లింలు రంజాన్ ను ఇంట్లోనే జరుపుకొవాలని విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు.