మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ ఓ దద్దమ్మ అని  ఎమ్మెల్యే క్రాంతి కుమార్ ఆరోపించారు. ప్రస్తుతం తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సమయం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆందోల్ లో ఆయన పర్యటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బాబూ మోహన్ పై సంచలన కామెంట్స్ చేశారు.  ఆందోల్ మున్సిపాలిటీని టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ ఎమ్మెల్యే క్రాంతి కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఆందోల్‌ను భ్రష్టు పట్టించిన బాబుమోహన్‌కు టీఆర్ఎస్‌ను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉండి తన సొంత నిధులను ఖర్చు చేయలేని దద్దమ్మ బాబుమోహన్ అంటూ ఘాటైన విమర్శలు చేశారు. 

Also Read పుర పోరులో కారుదే హవా.. 90 శాతం సీట్లు మావే: పల్లా రాజేశ్వర్ రెడ్డి...

సినిమా డైలాగులు మానుకోవాలని బాబుమోహన్‌కు హితవు చెప్పారు. ఆయనకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన విషయాన్ని మర్చిపోవద్దని అన్నారు. బాబుమోహన్ నీతిమాలిన రాజకీయానికి ప్రజలు చెక్ పెట్టారని క్రాంతి వ్యాఖ్యానించారు.