టీపీసీసీ పదవి విషయం ఓ కొలిక్కి రాకముందే కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. సీనియర్ నేత ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాను పార్టీని వీడతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. 

ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో పిసిసి అధ్యక్ష పదవి కోసం తీవ్ర పోటీ నడుస్తుంది. ఇదే సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇలా మాట్లాడడం చర్చనీయాంశంగా మారంది.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దర్శనానంతరం మాట్లాడుతూ... తెలంగాణలో బీజేపీ బలపడుతుందని ముందుగా చెప్పిన వ్యక్తిని నేనే... రాబోయే రోజుల్లో బీజేపీ లో చేరుతాను అంటూ చెప్పుకొచ్చారు. అయితే వెంకటరెడ్డి మాత్రం కాంగ్రెస్ ని వీడరని క్లారిటీ ఇచ్చారు. 

ఇదిలా ఉంటే టీపీసీసీ అధ్యక్ష పదవికి పోటీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్న సంగతి తెలిసిందే. టీపీసీసీకి రేవంత్ రెడ్డి, వెంకటరెడ్డి మధ్య గట్టి పోటీనే నడుస్తోంది. అయితే ఈ విషయం లో తుది నిర్ణయం అధిష్టానందే అన్నారు. తెలంగాణ ఉద్యమకారులు ఆత్మ శోభించకూండా కేసిఆర్ పరిపాలన చెయ్యాలని తన నిర్ణయాలను పున:సమిక్షించుకోవాలని తెలిపారు.