ఆదర్శం...ప్రభుత్వాసుపత్రిలోనే ఎమ్మెల్యే, కలెక్టర్ కరోనా చికిత్స

తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం వైద్యంపై భరోసా కల్పిస్తున్నారు ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే మరియు కలెక్టర్. 

MLA Jeevan Reddy corona treatment in nims

హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం వైద్యంపై భరోసా కల్పిస్తున్నారు ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే మరియు కలెక్టర్. కరోనా బారిన పడిన వీఐపిలు, ప్రజాప్రతినిధులు ప్రైవేట్ హాస్పిటల్స్ కు వెళుతుంటే ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, కరీంనగర్ కలెక్టర్ శశాంక ప్రభుత్వ దవాఖానాలో వైద్యం చేయించుకుంటున్నారు. భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సాంబశివరావు కూడా కరోనా బారినపడి హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. ఇలా వీరంతా నిమ్స్ లో చికిత్స పొందుతూ ప్రభుత్వ హాస్పిటల్స్ పై ప్రజలకు నమ్మకం కల్పిస్తున్నారు. 

ఇదిలావుంటే నిజామాబాద్ జిల్లాకు చెందిన గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్దన్ లు కరోనా వైరస్ తో బాధపడ్డారు. అలాగే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, వివేకానంద గౌడ్ లకు కరోనా వైరస్ సోకింది. అయితే వీరంతా ఇప్పటికే కరోనా నుండి కోలుకున్నారు. 

read more   ఒకే చితిపై నాలుగు మృతదేహాలు.. కరోనా రోగులపై అధికారుల వివక్ష
 
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో 1986 కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 62,703కు చేరుకుంది. కేసుల వివరాలను వెల్లడిస్తూ నేటి ఉదయం తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ ని విడుదల చేసింది. 

నిన్నొక్కరోజే 14 మంది మృతి చెందారు. జాతీయ రికవరీ రేట్ కన్నా తెలంగాణాలో ఎక్కువగా ఉందని తెలిపారు. రికవరీల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 72.3శాతంగా ఉందనితెలిపారు. మరణాల రేటు 0.82 శాతంగా ఉందని రాష్ట్రంలో ఇప్పటి వరకు 45,388 మంది రోగులు కోలుకోగా.. 519 మంది చనిపోయారు. ప్రస్తుతం తెలంగాణలో 16,796 యాక్టివ్ కేసులున్నాయి.

గురువారం 816 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా.. మరో 14 మంది మరణించారు. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికం హైదరాబాద్‌లోనే ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 586, మేడ్చల్ మల్కాజ్‌ ‌గిరిలో 207, రంగారెడ్డిలో 205, కరీంనగర్‌లో 116, సంగారెడ్డిలో 108, వరంగల్ అర్బన్‌లో 123మందికి కరోనా నిర్ధారణ అయింది.

గడిచిన 24 గంటల్లో 21,380 శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇప్పటి వరకు 4,37,582) పరీక్షలు నిర్వహించినట్టుగా బులెటిన్ లో తెలిపారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios