Harish Rao: "22 రోజులు గడుస్తున్నా జీతాల్లేవు"

Harish Rao: ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఎన్ని అమలుకు సాధ్యం కానీ హామీలిచ్చిందనీ, తాము అధికారంలోకి వచ్చి.. 100 రోజుల్లోనే అన్ని హామీలను అమలు చేస్తామని మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారనీ, ఎన్నికల్లో గెలిచిన తరువాత ప్రజల సమస్యలను పట్టించుకోవడం మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

MLA Harish Rao Counter To Revanth Reddy KRJ

Harish Rao: తెలంగాణ కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం పై మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల జీతాల విషయంలో కాంగ్రెస్ చెబుతున్నది ఒకటనీ,  చేస్తున్నది మరొకటి అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రభుత్వం ఉద్యోగులకు ప్రతినెల 1 వ తేదీన జీతాలు చెల్లిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారనీ. కానీ.. వారు ఇచ్చిన హామీపై వారు నిలబడటం లేదనీ, హామీలను  ఆచరణలో పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. "తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి నెల ఒకటవ తేదీన జీతాలు చెల్లిస్తామని ప్రచారం చేసుకున్నారు. కానీ ఆచరణ  మాత్రం సాధ్యం కావడం లేదు. 22 రోజులు గడుస్తున్నా అంగన్ వాడీలకు జీతం రాక అనేక తిప్పలు పడుతున్నారు. నెలంతా పని చేసి జీతం కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి వచ్చింది. ప్రభుత్వం తక్షణం స్పందించి, అంగన్ వాడీ టీచర్లు, అయాలు, సమగ్ర శిక్ష, కేజీబీవీ సిబ్బంది జీతాలు చెల్లించాలి" అని ట్వీట్ చేశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఎన్ని అమలుకు సాధ్యం కానీ హామీలిచ్చిందనీ, తాము అధికారంలోకి వచ్చి.. 100 రోజుల్లోనే అన్ని హామీలను అమలు చేస్తామని మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారనీ, ఎన్నికల్లో గెలిచిన తరువాత ప్రజల సమస్యలను పట్టించుకోవడం మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరో వైపు సత్యమేవ జయతే అంటూ  హరీష్‌ రావు ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్ పాలనను అప్రతిష్ట పాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా అప్పులు చేసిందని అధికార కాంగ్రెస్, బీజేపీ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఇదే విషయంపై ఫోర్బ్స్‌ ఓ రిపోర్టు విడుదల చేసింది. ఈ రిపోర్టుపై మాజీ మంత్రి హరీష్‌ రావు ఆసక్తికర ట్వీట్ చేశారు.
 
 ఫోర్బ్స్‌ రిపోర్టు ప్రకారం.. తెలంగాణ అప్పులు GSDPలో 23.8 శాతం మాత్రమేని, GSDPలో అతి తక్కువ శాతం అప్పులు ఉన్న 5 రాష్ట్రాల్లో తెలంగాణ ఒక్కటన్నారు. ఈ విషయాన్ని ఫోర్బ్స్ రిపోర్టు స్పష్టం చేసిందన్నారు. కాంగ్రెస్‌ సర్కార్ కావాలనే ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్ పాలన ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల శ్వేతపత్రం రిలీజ్ చేసినట్లు ఫోర్బ్స్‌ రిపోర్టు ద్వారా రుజువైందన్నారు. తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయిందని బీజేపీ, దాని సోషల్‌మీడియా, యూట్యూబర్‌లు చేస్తున్న ప్రచారం ఫేక్‌ అని తేలిపోయిందన్నారు. సత్యమే గెలుస్తుందంటూ ట్వీట్ చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios