ఖమ్మం: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెసు తరఫున పోటీ చేసి గెలిచి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో చేరిన శాసనసభ్యురాలు హరిప్రియకు చుక్కెదురైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లిన ఆమెపై కాంగ్రెసు కార్యకర్తలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 

ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం గోవింద్ర గ్రామంలో ప్రజలు హరిప్రియను అడ్డుకున్నారు. ఆమెపై రాళ్లతో దాడి చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెసు, టీఆర్ఎస్ కార్యకర్తలు పరస్పరం రాళ్ల దాడి చేశారు. 

పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. ప్రస్తుతం తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.