టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోదరుడి అనుమానాస్పద మృతి

https://static.asianetnews.com/images/authors/3800b66b-dc46-549b-a35e-91a1dbfb7895.jpg
First Published 22, Aug 2018, 12:59 PM IST
MLA Gangula Kamalakar brother dies with Stroke
Highlights

టీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన సోదరుడు గంగుల ప్రభాకర్ ఇవాళ ఉదయం అనుమానాస్పద రీతిలో మృతిచెందారు.
 

టీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన సోదరుడు గంగుల ప్రభాకర్ ఇవాళ ఉదయం అనుమానాస్పద రీతిలో మృతిచెందారు.

ఇవాళ ఉదయం కరీంనగర్ లోని తన ఇంట్లోంచి ప్రభాకర్ వాకింగ్ కు వెళ్లాడు. ఇలా వెళ్లిన అతడు పట్టణ శివారులోని రేకుర్తి వంతెన వద్ద శవంగా తేలాడు. అతడి మృతదేహాన్ని గమనించిన వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

అయితే గంగుల ప్రభాకర్ మృతిపై అతడి కుటుంబ సభ్యులు స్పందించారు. అతడు గుండెపోటుతో మృతి చెంది ఉంటాడని భావిస్తున్నట్లు వారు తెలిపారు. అయితే ఈ మృతికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియలేదని, పోస్టు మార్టం రిపోర్టు వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. 

గంగుల కమలాకర్ సోదరుడు ప్రభాకర్  కరీంనగర్ పట్టణంలోనే కుటుంబంతో కలిసి నివాసముంటున్నారు. ఆయనకు ఇద్దరు పిల్లలు. పెద్ద కొడుకు అమెరికాలో ఉండగా, చిన్నబ్బాయి సిబిఐటీ లో ఇంజనీరింగ్ చేస్తున్నాడు. ప్రభాకర్ ఆకస్మిక మృతితో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పెద్ద తనయుడు యూఎస్ నుండి వచ్చాక అంత్యక్రియలు చేపట్టనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 
 

loader