భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర దంపతులకు కరోనా పాజిటివ్.. నిన్న మంత్రుల పర్యనటలో పాల్గొన్న ఇరువురు..
తెలంగాణ కరోనా వైరస్ (Coronavirus) కలకలం రేపుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి (gandra venkataramana reddy) దంపతులు కరోనా బారినపడ్డారు.
తెలంగాణ కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి (gandra venkataramana reddy) కరోనా బారినపడ్డారు. వెంకటరమణా రెడ్డితో పాటుగా ఆయన సతీమణి, వరంగల్ జెడ్పీ చైర్‌పర్సన్ గండ్ర జ్యోతికి (gandra jyothi) కూడా కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. గండ్ర దంపతులకు మంగళవారం రాత్రి అస్వస్థతగా అనిపించడంతో పరీక్షలు చేయించుకోగా.. వారికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది.
అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ఆకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను నిన్న మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు (Errabelli Dayakar Rao), నిరంజన్ రెడ్డి (Niranjan Reddy), పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పరిశీలించారు. అయితే మంత్రలు పర్యటనలో ఎమ్మెల్యే గండ్ర దంపతులు కూడా పాల్గొన్నారు. ఈ పర్యటన సందర్బంగా మంత్రి నిరంజన్‌రెడ్డితో పాటు గండ్ర వెంకటరమణా రెడ్డి హెలికాప్టర్‌లో ప్రయాణఇంచారు. అయితే మంగళవారం రాత్రి జ్వరం రావడంతో పరీక్షించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది.
ఈ పరిణామాల నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిన్న మంత్రలు పర్యటనలో పాల్గొన్నవారు ఆందోళన చెందుతున్నారు. నిన్న మంత్రులు స్వయంగా క్షేత్ర స్థాయిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. ఈ పర్యటనలో ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసు సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఇక, తెలంగాణలో కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తుంది. గడిచిన 24 గంటల్లో 1,07,904 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2,983 పాజిటివ్ కేసులు వెలుగుచూసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 7,14,639కి చేరింది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు (corona deaths in telangana) మరణించారు. దీంతో తెలంగాణలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,062కి చేరింది. వైరస్ బారి నుంచి నిన్న 2,706 మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 22,472 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా ఇవాళ 1206 కేసులు నమోదయ్యాయి.