గోదావరిఖని:  సోమారపు సత్యనారాయణకు టీఆర్ఎస్ సముచిత స్థానం కల్పించినా కూడ ఆయన పార్టీపై విమర్శలు చేయడం సరైంది కాదని రామగుండం ఎమ్మెల్యే  చందర్  చెప్పారు.

మంగళవారం నాడు ఆయన  సోమారపు సత్యనారాయణ ఆరోపణలపై స్పందించారు.  తెలంగాణ ఉద్యమకారులను,తెలంగాణ వాదులను సోమారపు సత్యనారాయణ అణగదొక్కారని ఆయన ఆరోపించారు.

అవకాశవాద రాజకీయాలకు  సోమారపు సత్యనారాయణ పాల్పడ్డారని  చందర్ విమర్శించారు. సర్పంచ్ ఎన్నికల్లో  టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా సోమారపు సత్యనారాయణ పనిచేశారని ఆయన ఆరోపించారు. తన  ఓటమికి బాల్క సుమన్‌‌ కృషి చేశారని సోమారపు చేసిన విమర్శలను ఆయన ఖండించారు. పార్టీకి సోమారపు సత్యనారాయణ నష్టం చేశారని చందర్ విమర్శించారు. 


సంబంధిత వార్తలు

గౌరవం లేదు: బాల్క సుమన్‌పై సోమారపు తీవ్ర ఆరోపణలు

కేసీఆర్‌కు షాక్: టీఆర్ఎస్‌కు సోమారపు సత్యనారాయణ రాజీనామా