గోదావరిఖని: మాజీ ఎంపీ బాల్కసుమన్‌తో పాటు మరికొందరు పార్టీ నేతలు తనను ఓడించారని మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఆరోపించారు.

మంగళవారం నాడు ఆయన గోదావరిఖనిలో  మీడియాతో మాట్లాడారు.  పార్టీ సభ్యత్వ పుస్తకాలు ఇవ్వకుండా తనను ఇబ్బంది పెట్టారని  ఆయన చెప్పారు. పార్టీలో తనకు గౌరవం లేకుండా పోయిందన్నారు. 

 పార్టీలో క్రమశిక్షణ లేకుండా పోయిందని సోమారపు సత్యనారాయణ విమర్శలు గుప్పించారు.  ఈ కారణంగానే  తాను పార్టీని వీడాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా చెప్పారు. తాను ఏ పార్టీలో చేరనని, భవిష్యత్తులో రామగుండం మేయర్ గా పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. 

సోమారపు సత్యనారాయణ ఇటీవలనే బీజేపీ నేతలను కలిసినట్టుగా ప్రచారం సాగుతోంది. ఆయన బీజేపీ గూటికి చేరే అవకాశం ఉందంటున్నారు. కానీ, ఇవాళ  ఆయన మాత్రం తాను ఏ పార్టీలో చేరడం లేదని ప్రకటించడం గమనార్హం.

సంబంధిత వార్తలు

కేసీఆర్‌కు షాక్: టీఆర్ఎస్‌కు సోమారపు సత్యనారాయణ రాజీనామా