బెల్లంపల్లి: ఇంటి నుండి వెళ్లిపోయిన వ్యక్తి  22 ఏళ్ల తర్వాత ఇంటికి చేరుకొన్నాడు. దీంతో ఆ కుటుంబంలో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకొంది.

పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడకపూర్  గ్రామానికి చెందిన కుడ్రాజుల నంబయ్య మతిస్థిమితం లేక 22 ఏళ్ల క్రితం ఇంట్లో నుండి వెళ్లిపోయాడు.  అతను ఇంటి నుండి వెళ్లే సమయానికి భార్య కూడ ఉంది.. అయితే ఆయనకు అప్పటికే భార్యతో విడాకులు తీసుకొన్నారు.  రైలులో కర్ణాటకకు చేరుకొన్నాడు. ఆ తర్వాత కేరళకు చేరుకొన్నాడు.

మూడేళ్ల క్రితం తెలుగువాళ్లు సంబయ్యను గుర్తించి  పిచ్చాసుపత్రిలో చేర్పించారు. చికిత్స తర్వాత  ఆయనకు  తన  కుటుంబం గురించి చెప్పాడు.  దీంతో ఆయనను అక్కడి వాళ్లు వడకపూర్ తీసుకొచ్చారు. 

బెల్లంపల్లి పట్టణానికి చెందిన మహ్మద్ ఖాసీంబస్తీకి తీసుకొచ్చారు.  22 ఏళ్ల తర్వాత వచ్చిన కొడుకును చూసిన తల్లి భావోద్వేగానికి గురైంది.22 ఏళ్ల తర్వాత తన కొడుకు తిరిగి రావడంతో ఆమె ఆనందానికి అవధులు లేవు. తన కొడుకు చనిపోయాడని  భావించినట్టుగా తల్లి రాజమ్మ తెలిపారు.  స్థానికుల పేర్లను కూడ సంబయ్య చెప్పడంతో స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.