హైదరాబాద్: తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు ఎంఐఎం పార్టీ కసరత్తు మెుదలుపెట్టింది. ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీలు తొలి జాబితా అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్న నేపథ్యంలో ఎంఐఎం కూడా తొలి అభ్యర్థిని ప్రకటించింది. 

తాము కూడా ఎన్నికలకు రెడీ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజేంద్రనగర్ ఎంఐఎం అభ్యర్థిగా  మీర్జా రెహ్మత్ బేగ్ ను ప్రకటించింది. మీర్జా రెహ్మత్ బేగ్ ను ప్రకటిస్తూ అభినందనలు తెలియజేశారు ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ.