కేసీఆర్ వేసిన రోడ్డు మీద నడవద్దు.. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు వివాదస్పద వ్యాఖ్యలు
మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు వివాదాస్పద వ్యాక్యలు చేశారు. అన్నం పెట్టేవారికి సున్నం పెడుతున్నారని నర్సాపూర్ గ్రామస్థులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు వివాదాస్పద వ్యాక్యలు చేశారు. అన్నం పెట్టేవారికి సున్నం పెడుతున్నారని నర్సాపూర్ గ్రామస్థులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ది గురించి ఆలోచన చేయాలని అన్నారు. తనకు వ్యతిరేకంగా మాట్లాడేవారు ప్రభుత్వ పథకాలు తీసుకోకూడదని అన్నారు. వేరే పార్టీవాళ్లు ఉంటే కేసీఆర్ వేసిన రోడ్డు నడవద్దని, రైతు బంధు, పెన్షన్ తీసుకోకుండా ఉండాలని అన్నారు.
పథకాలన్నీ తీసుకుని నర్సాపూర్ లో డాన్స్ వేస్తాం అని మీరనుకుంటే.. తన సంగతి తెలియదని అన్నారు. అందరిని డ్యాన్స్ చేయిస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. నర్సాపూర్ వల్ల నాకేదో అయిద్దని మీరంతా అనుకుంటున్నారని.. కానీ ఏమి కాదని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి వివరిస్తూ ఓట్లు అడుగుతానని చెప్పారు.