బైక్ దొంగతనం చేసిన స్నేహితుడి గురించి చెప్పాలంటూ మైనర్ ను కొట్టి... దారుణ హత్య.. ఆరుగురి అరెస్ట్..
బైక్ దొంగతనం చేసిన స్నేహితుడి గురించి చెప్పాలంటూ ఓ టీనేజర్ మీద బాటిళ్లతో దాడి చేయడంతో మృతి చెందిన ఘటనలో పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ : బైక్ దొంగతనం చేసింది ఎవరో చెప్పమని ఓ టీనేజ్ కుర్రాడిని కొట్టి చంపిన కేసులో గ్గురు హిస్టరీ షీటర్లు సహా ఆరుగురిని కుల్సుంపురా పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. మృతుడు గ్లాస్ కటింగ్ వర్కర్ గా పనిచేసే (16) సోహైల్.
నిందితులు తమ బైక్‌ను దొంగిలించిన వ్యక్తి ఆ కుర్రాడి స్నేహితుడేనని, అతని గురించి సమాచారం అడుగుతూ బాధితుడిని తీవ్రంగా గాయపరిచారు. దీంతో దెబ్బలకు తాళలేక అతను మృతి చెందాడు.
అరెస్టయిన నిందితుల్లో కుల్సుంపుర హిస్టరీ షీటర్ బైద్ యోగేష్ (20), అత్తాపూర్‌కు చెందిన సేల్స్‌మెన్ ఎన్ శంకర్ (22), జియాగూడకు చెందిన విద్యార్థి బి శరత్ కుమార్ (19), జియాగూడకు చెందిన కె వరుణ్ రావు (23), జియాగూడకు చెందిన హిస్టరీ షీటర్ బి మహేష్, ఎ. జియాగూడకు చెందిన జీహెఎంసీ కాంట్రాక్ట్ కార్మికుడు, పురానాపూల్‌కు చెందిన హిస్టరీ షీటర్ కె రాజ స్వామి ఉన్నారు.
ఏప్రిల్ 22 రాత్రి సోహైల్ స్నేహితుడు ఫైజాన్ తన ఇంటి సమీపంలో పార్క్ చేసిన యోగేష్ బైక్‌ను దొంగిలించాడని అనుమానించిన నిందితులు ఆసిఫ్ నగర్‌కు చెందిన మహ్మద్ సోహైల్, అతని స్నేహితుడు కార్వాన్ ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్ దీపక్ కుమార్ (21)ని బలవంతంగా తీసుకెళ్లారు.
నిందితులు సోహైల్, దీపక్‌లపై బీరు సీసాలు, బెల్టులు, కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం వారిని గమనించిన వారు..,,ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ సోహైల్ మృతి చెందాడు. దీపక్ ఆ రోజు ఏం జరిగిందో పోలీసులకు చెప్పాడు.
ఫైజాన్ స్నేహితుడు అరుణ్ దొంగిలించిన బైక్‌ను యోగేష్‌కు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. యోగేష్ బైక్ కొన్న డబ్బులు చెల్లించకపోవడంతో కోపానికి వచ్చిన ఫైజాన్.. వారికి చెప్పకుండా బైక్ ను తీసుకెళ్లాడని కుల్సుంపురా పోలీసులు తెలిపారు.