చాక్లెట్లు ఆశ పెట్టి బాలికపై అన్నాదమ్ముళ్ల అత్యాచారం

Minor raped by neighbour and his brother
Highlights

ఐదో తరగతి చదవుతున్న 9 ఏళ్ల బాలికపై అన్నాదమ్ముళ్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు.

హైదరాబాద్: ఐదో తరగతి చదవుతున్న 9 ఏళ్ల బాలికపై అన్నాదమ్ముళ్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు. పొరుగున ఉండే 20 ఏళ్ల యువకుడు వారం రోజుల క్రితం బాలికపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత 18 ఏళ్ల వయస్సు గల అతని తమ్ముడు ఆదివారంనాడు ఆమెను రేప్ చేశాడు. 

నిందితులు శ్రీకాంత్, ఎల్లేస్వామి అలియాస్ ఎల్లేష్ మధ్యలోనే చదువుకు స్వస్తి చెప్పారు. పెద్దలు వారి పని మీద బయటకు వెళ్లిన సమయంలో సాయంత్రం బాలికకు చాక్లెట్లు ఆశ పెట్టారు. 

సోమవారంనాడు బాలిక తల్లికి అసలు విషయం చెప్పింది. అన్నదమ్ముళ్లు ఇద్దరు తనపై చేసిన దాష్టీకం గురించి చెప్పింది. దాంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

కేసును వెనక్కి తీసుకోవాలని నిందితులు బాధితురాలి కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

loader