Asianet News TeluguAsianet News Telugu

ఆస్పత్రికి తీసుకువెడతానని చెప్పి.. కన్నకూతురిపై తండ్రి అత్యాచారం...

రేణిగుంట మండలానికి చెందిన ఓ వ్యక్తి తన కుమార్తెను తిరుపతిలో  Medical examinationల కోసమని అక్టోబర్ 24వ తేదీన ఇంటి నుంచి తీసుకెళ్లాడు. ఆ పై రేణిగుట, తిరుపతి మార్గంలోని లక్ష్మీపురం కాలనీకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. 

Father convicted of molesting daughter renigunta, andhrapradesh
Author
Hyderabad, First Published Nov 1, 2021, 8:49 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

చిత్తూరు : రేణిగుంటలో దారుణం చోటు చేసుకుంది. కన్న కూతురి (14)పై ఓ తండ్రి rape చేశాడు. సభ్యసమాజం తలదించుకునే ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు రేణిగుంట మండలానికి చెందిన ఓ వ్యక్తి తన కుమార్తెను తిరుపతిలో  Medical examinationల కోసమని అక్టోబర్ 24వ తేదీన ఇంటి నుంచి తీసుకెళ్లాడు. 

ఆ పై రేణిగుట, తిరుపతి మార్గంలోని లక్ష్మీపురం కాలనీకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని బాధితురాలు తన తల్లికి ఆలస్యంగా చెప్పడంతో ఆదివారం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. 

కన్నకూతురిని రేప్ చేసి.. డబ్బుల కోసం ఇతరులతో కూడా...
ఇదిలా ఉండగా, కన్న కూతురుని కంటికిరెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కామంతో కళ్లు మూసుకుపోయి కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా కాసులకు కక్కుర్తిపడి కూతురి మానాన్ని మరికొందరికి అమ్ముకున్నాడు. మానవ సంబంధాలకు మచ్చలాంటి ఈ దారుణం ఉత్తరప్రదేశ్ లో వెలుగుచూసింది. కొన్నేళ్లుగా తనపై జరిగుతున్న అకృత్యాల గురించి తాజాగా బాలిక బయటపెట్టింది. 

బాధిత బాలిక తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ట్రక్ డ్రైవర్ గా పనిచేసే తండ్రి ఆరో తరగతిలో వుండగానే బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్లు బాధిత బాలిక తెలిపింది. తల్లి ఇంట్లోలేని సమయంలో కొత్తబట్టలు కొనిపెడతానని ఒంటరిగా బయటకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపింది. అప్పటినుండి పలుమార్లు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసేవాడని... ఈ విషయం ఎవరికైనా చెబితే తల్లిని చంపేస్తానని బెదిరించేవాడని బాలిక తెలిపింది. 

అయితే రానురాను తన తండ్రి మరింత నీచానికి దిగజారాడని... డబ్బుల కోసం తనను ఇతరుల వద్దకు పంపించేవాడని తెలిపింది. ప్రతిసారీ తనను ఓ హోటల్ కు తీసుకుని వెళ్లేవాడని... అక్కడ ఎవడో ఒకడు తనపై అత్యాచారానికి పాల్పడేవాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఇలా ఓసారి సమాజ్ వాది పార్టీ జిల్లా అధ్యక్షుడు తిలక్ యాదవ్ కూడా తండ్రితో కలిసి తన వద్దకు వచ్చాడని... అడ్డుచెబుతున్నా వినకుండా బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడని బాధిత బాలిక వెల్లడించింది.

ఛీ..ఛీ.. వీడు తండ్రేనా.. యేడాదిగా కూతురిపై అఘాయిత్యం.. జైలుకెళ్లొచ్చినా వదలనంటూ బెదిరింపు...

ఇక అప్పటినుండి పలుమార్లు తిలక్ సోదరులు, స్నేహితులు, బందువులు తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధిత బాలిక తెలిపింది. ఇలా తన తండ్రి సాయంతో ఇప్పటివరకు దాదాపు 28మంది అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక దయనీయంగా తెలిపింది. 17ఏళ్ల బాధిత బాలిక దయనీయ పరిస్థితి ప్రతిఒక్కరినీ కలిచివేస్తోంది. ముందు బాలిక తండ్రిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని... ఎంత పలుకుబడి వున్నా మిగతావారిని కూడా వదిలిపెట్టకూడదని డిమాండ్ చేస్తున్నారు. 

బాధిత బాలిక బయటపెట్టిన నిజాలు అతి త్వరలో ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్ లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ నేపధ్యంలో సమాజ్ వాది పార్టీ నేత తిలక్ యాదవ్ సోషల్ మీడియా వేదికన స్పందించారు. బాలిక ఆరోపణల్లో నిజం లేదని... తమను కావాలనే ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నాడు. తనతో పాటు తన సోదరులకు ఈ అత్యాచార ఆరోపణలతో ఎలాంటి సంబంధం లేదని తిలక్ యాదవ్ తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios