మైనర్ బాలికపై ఆరునెలలుగా అత్యాచారం, గర్భందాల్చిన చిన్నారి

First Published 22, Jul 2018, 11:48 AM IST
Minor girl raped in  hyderabad for over six months
Highlights

హైదరాబాద్ లో మరో దారుణం చోటుచేసుకుంది. అభం శుభం తెలియని ఓ చిన్నారిపై ఓ మైనర్ బాలుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆరు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతుండటంతో బాలిక గర్భం దాల్చింది. ఈ ఘటన లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 

కార్వాన్ ప్రాంతానికి చెందిన 17ఏళ్ల బాలుడు పెన్షన్ పురా ప్రాంతానికి చెందిన బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ఆమెకు మాయమాటలు చెప్పి ఆరునెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. అయితే ఈ మధ్య బాలిక ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. దీంతో అసలు విషయం బైటపడింది. బాలిక నాలుగు నెలల గర్భవతి అని డాక్టర్లు తెలియజేశారు.

ఈ విషయంపై బాలికను తల్లిదండ్రులు నిలదీయగా ఈ ఘటనకు కారణమైన బాలుడి గురించి తెలిపింది. దీంతో బాలిక తల్లిదండ్రలు సదరు మైనర్ బాలుడిపై పోలీసులకు పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 
loader