ఐస్ క్రీంలో మత్తు మందు కలిపి... బాలికపై అత్యాచారం చేసి.. అనంతరం హత్య చేశారు. ఈ దారుణం హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మీర్ పేట పోలీసు స్టేషన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ కి చెందిన 17ఏళ్ల బాలికకి ఐస్ క్రీమ్ లో మత్తుమందు కలిపి... అత్యాచారం చేశారు.

బాలిక సవతి తల్లి అన్నయ్య మల్లేష్ ఈ అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కాగా... అత్యాచారం జరిగి కొన్ని నెలలు గడవగా.. బాలిక గర్భం దాల్చింది. దీంతో.. ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకు మల్లేష్.. బాలిక సవతి తల్లికి రూ.50వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.

అయితే విషయం బయటకు రావడంతో బాలికను కొట్టి హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించారు. దీంతో బాలిక బంధువులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు మల్లేష్ పరారీలో ఉన్నాడు. అతని కోసం వేట ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.