Asianet News TeluguAsianet News Telugu

కామారెడ్డి జిల్లాలో విషాదం: బిడ్డకు జన్మనిచ్చిన మైనర్ బాలిక, ఆత్మహత్య


కామారెడ్డి జిల్లాలో మైనర్ బాలిక శిశువుకు జన్మనిచ్చిన తర్వాత మైనర్ బాలిక ఆత్మహత్య  చేసుకొంది. గాంధారి మండలంలోని  ఓ గిరిజన తండాకు చెందిన మైనర్ బాలికను ప్రేమించి పెళ్లి చేసకొంటానని మోసం గర్భవతిని చేశాడు. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత బాధితురాలు ఆత్మహత్య చేసుకొంది.

minor girl  commits suicide after gave birth child  in Kamareddy district
Author
Kamareddy, First Published Sep 1, 2021, 11:48 AM IST

కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో బుధవారం నాడు విషాదం చోటు చేసుకొంది. శిశువుకు జన్మనిచ్చిన  మైనర్ బాలిక బావిలో దూకి ఆత్మహత్య చేసుకొంది.  ఈ ఘటన గాంధారి మండలంలో  విషాదాన్ని నింపింది.కామారెడ్డి జిల్లాలోని గాంధారి మండలంలోని ఓ గిరిజన తండాకు చెందిన మైనర్ బాలిక బుధవారం నాడు శిశువుకు జన్మనిచ్చింది. ఆమె వయస్సు 16 ఏళ్లు. మైనర్ బాలికను ప్రేమ పేరుతో ఓ వ్యక్తి మోసం చేశాడని స్థానికులు చెబుతున్నారు. చిన్నారికి జన్మనిచ్చిన తర్వాత దుర్గం చెరువు సమీపంలోని ముళ్లపొదల్లో  శిశువును బాధితురాలు వదిలేసింది.

ఆ తర్వాత మైనర్ బాలిక బావిలో దూకి ఆత్మహత్య చేసుకొంది. పెళ్లి చేసుకొంటానని నమ్మించి తనను మోసం చేశారని  మనోవేదనకు గురైన బాధితురాలు ఆత్మహత్య చేసుకొంది. బావిలో నుండి మృతదేహన్ని వెలికితీసి పోస్టుమార్టం కోసం తరలించారు. ముళ్ల పొదల్లో ఉన్న శిశువును గుర్తించిన స్థానికులు వైద్య ఆరోగ్య సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ లో ఆ చిన్నారిని కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని  వైద్యులు చెప్పారు. ఇదిలా ఉంటే మైనర్ బాలికను గర్భవతిని చేసిన  వ్యక్తి ఎవరనే విషయమై తేలాల్సి ఉంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios