Asianet News TeluguAsianet News Telugu

పనికిలోకి రాలేదని మైనర్ బాలుడిపై యజమాని పైశాచికత్వం

పనిలోకి రాలేదనే నెపంతో 12 బాలుడిని యజమాని చిత్ర హింసలు పెట్టాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకొంది. జిల్లాలోని మల్కాపూర్ (ఎ)లో  ఈ ఘటన బుధవారం నాడు జరిగింది. 

minor boy beaten by owner in nizambad district
Author
Nizamabad, First Published Aug 12, 2020, 6:03 PM IST

నిజామాబాద్: పనిలోకి రాలేదనే నెపంతో 12 బాలుడిని యజమాని చిత్ర హింసలు పెట్టాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకొంది. జిల్లాలోని మల్కాపూర్ (ఎ)లో  ఈ ఘటన బుధవారం నాడు జరిగింది. 

12 ఏళ్ల బాలుడిని ఓ వ్యక్తి పనికి పెట్టుకొన్నాడు. మైనర్ బాలుడిని పనికి పెట్టుకోవడం నేరం. అయితే ఇవాళ పనికి రాలేదని యజమాని ఆ బాలుడి కాళ్లకు తాళ్లు కట్టి రోడ్డుపై లాక్కెళ్లాడు.

తనను వదిలిపెట్టాలని ఆ బాలుడు ఎంత బతిమిలాడినా కూడ అతను పట్టించుకోలేదు. కొద్ది దూరం మట్టిరోడ్డుపై చిన్న చిన్న రాళ్లపైనే లాక్కెళ్లాడు. కొద్దిసేపు  చెట్టుకు కట్టేశాడు. అంతేకాదు అతణ్ణి విపరీతంగా కొట్టాడు. 

ఈ తతంగాన్ని స్థానికులు అంతా సినిమా చూసినట్టు చూశారు, కానీ ఒక్కరూ కూడ ఆపలేదు. ఈ దృశ్యాలను కొందరు సెల్ ఫోన్లలో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

చిన్న పిల్లలను పనిలో పెట్టుకోకూడదని చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలను తుంగలో తొక్కి పనిలో పెట్టుకోవడమే కాకుండా తీవ్రంగా కొట్టడంపై పలు విమర్శలు చేలరేగుతున్నాయి. బాలుడిని కొట్టిన యజమానిపై చర్యలు తీసుకోోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios