Asianet News TeluguAsianet News Telugu

టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్నిక: కేసీఆర్‌‌ను ప్రతిపాదిస్తూ మంత్రుల నామినేషన్లు(వీడియో)

 టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్ష పదవికి కేసీఆర్ పేరును ప్రతిపాదిస్తూ  ఆరు సెట్ల  నామినేషన్ పత్రాలు ఎన్నకల అధికారి శ్రీనివాస్ రెడ్డికి అందించారు మంత్రులు. ఈ నెల 25న టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించనున్నారు.

ministers filed six sets of nominations for TRS state president post
Author
Hyderabad, First Published Oct 17, 2021, 3:33 PM IST

హైదరాబాద్: Trs రాష్ట్ర అధ్యక్ష పదవికి కేసీఆర్ పేరును ప్రతిపాదిస్తూ పలువురు మంత్రులు Nominations దాఖలు చేశారు.టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్ష పదవికి కేసీఆర్ పేరును ప్రతిపాదిస్తూ మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఎర్రబల్లి దయాకర్ రావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ రెడ్డికి ఇవాళ నామినేషన్ పత్రాలు అందించారు. మరో వైపు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడ కేసీఆర్ కు మద్దతుగా నామినేషన్లు దాఖలు చేశారు.

also read:టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులతో కేసీఆర్ భేటీ: కీలకాంశాలపై చర్చ

టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక కోసం ఇవాళ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 22వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు.ఈ నెల 23న నామినేషన్లను పరిశీలించనున్నారు.ఈ నెల 24న నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు.

"

టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఈ నెల 25న ఎన్నిక నిర్వహిస్తారు. అదే రోజున పార్టీ ప్లీనరీని నిర్వహించనున్నారు.టీఆర్ఎస్ ఆవిర్భావం, ఏడేళ్లుగా రాష్ట్రంలో పోర్టీ అమలు చేసిన పథకాలపై ప్రజలకు మరోసారి వివరించేందుకు తెలంగాణ విజయ గర్జన పేరుతో  వరంగల్‌లో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభను నిర్వహించనుంది.గత ఏడాది కరోనా పరిస్థితుల నేపథ్యంలో టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను పార్టీ నిర్వహించలేదు. దీంతో ఈ ఏడాది పార్టీ సంస్థాగత ఎన్నికలలో పాటు  సభను భారీ ఎత్తున నిర్వహిించాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకొంది.

 


 

Follow Us:
Download App:
  • android
  • ios