జాతీయ పార్టీ ఏర్పాటు: ప్రగతి భవన్ లో మంత్రులు,జిల్లా అధ్యక్షులతో కేసీఆర్ భేటీ

టీఆర్ఎస్ జిల్లాలకు చెందిన అధ్యక్షులు,  మంత్రులతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు.  జాతీయ పార్టీ ఏర్పాటు విషయమై కేసీఆర్ నేతలతో చర్చించనున్నారు. 

Ministers and TRS  District President Meeting with KCR In pragathi Bhavan

హైదరాబాద్: టీఆర్ఎస్ జల్లా అధ్యక్షులు, మంత్రులతో  తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం నాడు ప్రగతి భవన్ లో  సమావేశమయ్యారు.  ఈ నెల 5వ తేదీన జాతీయ పార్టీని కేసీఆర్ ప్రకటించనున్నారనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత నెలకొంది. జాతీయపార్టీ ఏర్పాటుకు సంబంధించి కేసీఆర్ కార్యాచారణను సిద్దం చేసుకున్నారని పార్టీ వర్గాలు చెబతున్నాయి.  జాతీయపార్టీ జెండా, ఎజెండాపై కేసీఆర్ చర్చించనున్నారు. జాతీయ పార్టీ ఏర్పాటుకు దారి తీసిన పరిస్థితులపై కేసీఆర్ వివరించనున్నారు. 

ఈ నెల 5వ తేదీన తెలంగాణ సీఎం కేసీఆర్  టీఆర్ఎస్  శాసనసభపక్ష సమావేశంతో పాటు పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు.  జాతీయ పార్టీపై టీఆర్ఎస్ఎల్పీతో పాటు పార్టీ విస్తృతస్థాయి సమావేశం  తీర్మానాలు చేయనుంది. జాతీయ పార్టీ ఏర్పాటు చేయాల్సిన అవశ్యకత గురించి పార్టీ నేతలకు కేసీఆర్ దిశా నిర్ధేశం చేయనున్నారు.

ఈ నెల 5వ తేదీన  జాతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించి కేసీఆర్ ప్రకటన చేయనున్నారు. ఈనెల 6వ తేదీన ఢిల్లీకి టీఆర్ఎస్ ప్రతినిధి బృందం వెళ్లనుంది.జాతీయపార్టీ ఏర్పాటుకు సంబంధించి  రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపట్టనున్నారు.  మహరాష్ట్ర నుండి దేశ వ్యాప్త పర్యటనను ప్రారంభించాలని కేసీఆర్ భావిస్తున్నారు. 

దేశంలో బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటు కోసం  కేసీఆర్ విపక్షాలకు చెందిన పార్టీలను కూడగడుతున్నారు.  బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలకు చెందిన నేతలు, సీఎంలతో కేసీఆర్  సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే  పలు రాష్ట్రాల్లో సీఎం లు,నేతలతో కేసీఆర్ సమావేశం నిర్వహించారు.  మరో వైపు  కుమారస్వామి,శంకర్ సింగ్ వాఘేలా వంటి నేతలు హైద్రాబాద్ లో కేసీఆర్ తో సమావేశమయ్యారు.

ఫామ్ హౌస్ వేదికగా జాతీయ పార్టీఏర్పాటుపై కేసీఆర్ కొందరు పార్టీముఖ్యులతో చర్చించారు.  పార్టీ ఏర్పాటు ప్రకటన తర్వాత తెలంగాణ సీఎం యాగం చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఎప్పుడు ఎక్కడ యాగం చేస్తారనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

also read:ఈ నెల 6న జాతీయపార్టీ రిజిస్ట్రేషన్‌కై ఢిల్లీకి టీఆర్ఎస్ నేతలు: మహరాష్ట్ర నుండి కేసీఆర్ దేశ వ్యాప్త టూర్

దేశంలో బీజేపీ ప్రభుత్వం  అనుసరించిన విధానాల కారణంగానే  ప్రజలుఇబ్బందులు పడుతున్నారని కేసీఆర్ విమర్శలుచేస్తున్నారు. దేశంలో ఆర్ధికంగా తిరోగమనం వైపునకు వెళ్తుందని కేసీఆర్ఆరోపిస్తున్నారు. 2024లో బీజేపీసర్కార్ అధికారంలోకి రాదని  కేసీఆర్ ధీమాగా చెబుతున్నారు. ఈ విషయంలో తమ పార్టీ కీలకంగా వ్యవహరించనుందని కేసీఆర్ ప్రకటించారు.  ఈదిశగానే జాతీయపార్టీ ఏర్పాటు చేయాలని కేసీఆర్ ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.ఈ విషయమై పార్టీ నేతలతో కేసీఆర్ చర్చిస్తున్నారు. ఈ నెల 5వ తేదీన నిర్వహించే సమావేశానికి సన్నాహక సమావేశంగా ఇవాళ భేటీ సాగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios